HomeTelanganaCrime

నాభర్తను పెట్రోల్ పోసి పోలీసులే తగలబెట్టారు.. హోంగార్డు భార్య సంచలన ఆరోపణ‌

నాభర్తను పెట్రోల్ పోసి పోలీసులే తగలబెట్టారు.. హోంగార్డు భార్య సంచలన ఆరోపణ‌

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోం గార్డు రవీందర్ మృతి చెందాడు. కాలిన గాయాలతో మంగళవారం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పెట్రోల్ పోసుకొని ఆ

సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు మృతి…కేసీఆర్ సంతాపం
మనిషిని చంపేసిన రోబో
గద్దర్ మరణం పట్ల KCR దిగ్భ్రాంతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోం గార్డు రవీందర్ మృతి చెందాడు. కాలిన గాయాలతో మంగళవారం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు చెప్తున్నప్పటికీ , పోలీసుల వాదన అబద్దమని మృతుడి భార్య సంధ్య అఱొపీంచఱూ.

తన భర్తపై ఏఎస్సై నర్సింగరావు, కానిస్టేబుల్ చందులు పెట్రోల్ పోసి తగలబెట్టారని సంధ్య ఆరోపించారు. కొంత కాలంగా వారు తన భర్తను వేధిస్తున్నారని ఆమె అన్నారు. మంగళవారం గోషామహల్‌లోని హోంగార్డు కమాండెంట్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని ఆమె తెలిపారు.

ఉదయాన్నే చెత్త బైట ప్డేసేందుకు బైటికి వెళ్ళిన తన తండ్రి తిరిగి రాలేదని రవీందర్ పిల్లలు చెప్తున్నారు. తాము ఫోన్ చేయగా ఆఫీస్ నుండి పోన్ వచ్చిందని, అందుకే తాను వచ్చేశానని తన తండ్రి చెప్పారని పిల్లలు చెప్పారు. డ్రస్సు వేసుకోకు‍ండా నైట్ డ్రస్సుతో తన తండ్రి ఆఫీస్ కు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు.

తన భర్త ఫోన్ ను అన్ లాక్ చేసి డాటే మొత్తం డిలీట్ చేశారని సంధ్య ఆరోపించారు. ఏఎస్సైన్ నర్సింగరావు, కానిస్టేబుల్ చందులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.

తన భర్త చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉండగా తనదగ్గరికి వచ్చిన హమీద్ అనే పోలీసు అధికారి తనను పక్కదారి పట్టించారని, పెట్రోల్ బంక్ లో ప్రమాదం జరిగిందని చెప్పాలని, అలా చెప్పకపోతే బెనిఫిట్స్ ఏవీ రావని తనను బెదిరించారని ఆమె అన్నారు. కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజ్ ను బైట్ అపెట్టాలని9 ఆమె డిమాండ్ చేశారు.

మరో వైపు మృతుడు రవీందర్ భార్య సంధ్య, పిల్లలు ఉస్మానియా ఆస్పత్రి వద్ద బైటాయించారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచే కదలబోనని ఆమె ప్రకటి‍ంచారు. ఆమెకు మద్దతుగా పలువురు హోం గార్డులు కూడా బైటాయించారు.

కాగా, హోం గార్డు రవీందర్ మరణంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. హోం గార్డుల ఇంచార్జ్ మాట్లాడినట్టుగా ఓ ఆదియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ రోజు హోం గార్డులెవ్వరూ పోలీసు స్టేషన్ల్ అనుంచి బైటికి పోవద్దని, డ్యూటీలు లేని వాళ్ళు కూడా స్టేషన్ లోనే ఉండాలని అధికారు ఆదేశాలిస్తున్న వాయిస్ వైరల్ అయ్యింది.

అయితే రవీందర్ విషయంలో ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఏదో జరిగిందని దానిని దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పలువురు హోం గార్డులు అంటున్నారు. హోం గార్డుల పట్ల ఇతర పోలీసు అధికారులు అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రవీందర సంఘటనను పక్కదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందని, ఆయన భార్యతో సహా, హోంగార్డులు కూడా ఆరోపిస్తున్నారు.