HomeTelangana

సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

ఆర్మూర్ సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్ ) గురువులే మార్గదర్శకాలు. రెవరెండ్ డాక్టర్ మన్నే శ్రీనివాస్. ఘనంగా సిఎస్ఐ చర్చిలో టీచర్స్ డే. సమాజంలో గురువులు

మతోన్మాద వ్యతిరేకి, సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల మావోయిస్ట్ పార్టీ సంతాపం
‘అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం పనిచేస్తా’
బీజేపీకి విజయశాంతి రాజీనామా!

ఆర్మూర్ సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్ )

గురువులే మార్గదర్శకాలు. రెవరెండ్ డాక్టర్ మన్నే శ్రీనివాస్. ఘనంగా సిఎస్ఐ చర్చిలో టీచర్స్ డే. సమాజంలో గురువులు నేర్పించిన సూచనలే భవిష్యత్ మార్గదర్శకాలు సూచిస్తాయని రెవరెండ్ డాక్టర్ మన్నే శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సీఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చిలో ఆదివారం ఘనంగా టీచర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చేసిన పలు ప్రసంగాల ద్వారా అనేకులైన మనుషులు మారు మనసు పొందిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అదే రీతిగా నేటి సమాజంలో కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు మార్గదర్శకాలుగా నిలిచారని ఆయన వివరించారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారే అటు తల్లిదండ్రులకు ఇటు గురువులకు లోబడి ఉంటారని చెప్పారు. మంచి విషయాలను విని నేర్చుకోవడం వలన భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు చేరుకుని అవకాశం ఉంటుందని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ విద్య సంస్థల్లో పని చేస్తున్న సుమారు 40 మంది ఉపాధ్యాయులను పూలమాలలు శాలువాలతో సన్మానించారు. కోయర్ బృందం సభ్యులు ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కవిత శ్రీనివాస్, ఇందిర, విజయలక్ష్మి, మధు పరిమళ వాణి, అంబుజా కిరణ్, గుమ్మడి సుజాత, హెలెన్, ఆంధ్రయ్య, వినయ్ కుమార్, ఓబన్న, జిన్న సుందర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.