HomeTelangana

ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్ గా ‘తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు

ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్ గా ‘తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు , విద్యావంతులు హైదరాబాద్ లో సమావేశమై .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి – మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న‌
12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు , విద్యావంతులు హైదరాబాద్ లో సమావేశమై .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై ప్రజలను చైతన్యపరిచి , ప్రశ్నించే గొంతును బలోపేతం చేసేందుకు. “ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ( TPJAC)” గా ఏర్పడ్డారు. ఈ కమిటీ ఆవిర్భావాన్ని ఈ రోజు హైదరాబాద్ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో
ప్రకటించారు.

ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక సాధన సమయంలో ప్రజలను కదలించడం లో JAC లు కీలక పాత్ర పోషించాయి కానీ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అవి కనుమారుగయ్యాయి. దాని వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పై నిఘా పెట్టె, ప్రజల కోసం పని చేసే ఐక్య వేదికలు లేకపోవడం వల్ల ప్రభుత్వం నిరంకుశంగా తయారైంది.

గత దశాబ్ధకాల అనుబావంతో ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడే ఐక్య వేదిక అవసరాన్ని గుర్తించి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ “ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు . ఈ వేదిక ప్రజల లోకి విస్తృతంగా అన్ని విషయాలను తీసుకు వెళ్ళి, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతుందని అన్నారు.

సమావేశంలో వేదిక కో కన్వీనర్ లుగా ఉన్న తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కరుణాకర్ దేశాయి , తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య , రైతు ఉద్యమ నాయకులు కన్నెగంటి రవి, సామాజిక కార్యకర్త కాకర్ల సజయ ,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సమున్నత, ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సలీం పాషా, వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రోగ్రెసివ్ డెమాక్రాటిక్ ఫోరం నాయకులు గురువా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర రావు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కొండల్ రెడ్డి , RTC నాయకులు ప్రభాకర్, రైల్వే జాక్ నాయకులు ముత్తయ్య , పర్యావరణ వేత్త డాక్టర్ బాబూరావు, TSJAC నాయకులు రామగిరి ప్రకాష్, బిఎస్ఎన్ఎల్ కార్మిక సంఘ నాయకులు కూడా మాట్లాడారు,

రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం లో ఉన్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో పాలిస్తున్నాయని, ప్రజల మధ్య ద్వేషాలు రెచ్చగొడుతున్నాయని , దేశాన్నీ,రాష్ట్రాన్నీ అప్పుల ఊబిలో దించుతున్నాయనీ, ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయనీ విమర్శించారు.

రాష్ట్ర విద్యా, వైద్య రంగాలు తీవ్ర దుస్థితిలో ఉన్నాయనీ, వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావడం లేదనీ, కవులు రైతులను గుర్తించకుండా ఈ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలకు కారణమవుతుందనీ విమర్శించారు.
ఇప్పుడు ఏర్పడే వేదిక కృషి కేవలం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితం కాకుండా , నిత్యం ప్రజల గొంతుగా ఎన్నికల తరువాత కూడా కొనసాగుతుందనీ, రాష్ట్ర వ్యాపితంగా ప్రజా సంఘాలు వేదికలో భాగస్వాములు కావాలనీ వేదిక నాయకులు పిలుపు ఇచ్చారు.

జేఏసీ ఈ క్రింది లక్ష్యాన్ని ప్రకటించింది :

“తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం. ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత, ఉద్యమం నుండీ ఎదిగిన రాజకీయాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తాయని, ప్రజాస్వామ్య విలువలను కాపాడి ,ప్రజాస్వామ్య సమాజ నిర్మాణ దిశగా చర్యలు తీసుకుంటుందని ప్రజలు భావించారు. కానీ గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పాలన ప్రజల ఆకాంక్షలకనుగుణంగా చర్యలు తీసుకోవడం అటుంచి, ఏక వ్యక్తి పాలనగా మరి, ప్రజాస్వామ్య విలువలు నీరుగారిపోయాయి.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు బాగా దెబ్బ తిన్నాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగాయి. నిత్యావసర సరుకులు, ఇతర సర్వీసుల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ సమస్యలన్నీ వచ్చే ఎన్నికలలో చర్చకు రాకపోతే , ప్రజలు వీటిపై ప్రశ్నలు ఆడగక పోతే , ఈ సమస్యలతో రానున్న కాలంలో కూడా జీవించడమే కాక, భవిష్యత్ జన జీవనం మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది.
పాలకులను ప్రజలు ఈ ప్రశ్నలను అడగాలని, తెలంగాణ పీపుల్స్ జేఏసీ కోరుతున్నది. ఈ విషయాలపై ప్రజల దగ్గరకు వెళ్ళి TPJAC చర్చిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలు చైతన్య వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే,ప్రజాస్వామ్య వ్యవస్థను బలీయం చేయకుంటే, రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజ్యాంగం మీదా, రాజ్యాంగ సంస్థల మీదా ఏ మాత్రం గౌరవం లేదు. సంస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. ప్రజల సమస్యలు పరిష్కరించి, ఒక ప్రజాస్వామ్య, మానవీయ సమాజం వైపు కాక, మత భావజాలంతో ,మతోన్మాదాన్ని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రజలపై హింస పెరిగింది. శాంతి బధ్రతలు, చట్ట బద్ధ పాలన పూర్తిగా దెబ్బ తిన్నాయి. రాజ్యాంగం లోని స్వేచ్చ,సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, లౌకిక విలువల మీద పెద్ద దాడి జరుగుతున్నది. ఈ విలువలు ,మన ముందు తరాలు మనకు అందించన అత్యున్నత విలువలు. ఈ విలువలను మనం కాపాడుకోవాలి.

మనం ఈ దిశగా కృషి చేయకపోతే, అరాచకం పెరిగి, నియంతృత్వ పాలన మన ఇంటి తలుపు తడుతుంది. సమాజ అభివృద్ధికి మానవీయ విలువలే ప్రమాణం.
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TP JAC) రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి , ఎవరికి వద్ధు అని చెప్పదు . ఈ కమిటీ ప్రజలను ఆలోచించమని, రాజకీయంగా మరింత పరిణతి తో ముందుకు పోవాలని, సమున్నతమైన మానవ విలువలను కాపాడుకోవాలని మాత్రం కోరుతుంది.
ఈ కృషికి సమాజం పెద్ద ఎత్తున మద్ధతు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అంగీకరించే సంస్థలు, వ్యక్తులు ఎవరైనా, సంస్థలో చేరవచ్చు. లేదా ఇటువంటి కృషి చేస్తున్న ఏ సంస్థకయినా TPJAC తన మద్ధతును అందిస్తుంది. “

ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా, మండల స్థాయి వరకూ వెంటనే కమిటీలను ఏర్పాటు చేస్తుంది. విస్తృతంగా గ్రామ, బస్తీ స్థాయి వరకూ ప్రచారం చేస్తుంది. వివిధ మీడియా వేదికలను ఇందుకోసం ఉపయోగించుకుంటుంది. సాహిత్యాన్ని ప్రచురిస్తుంది.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న వివిధ అంశాలపై సెప్టెంబర్ 15 నాటికి అవగాహన పత్రాలు తయారు చేయాలని సమావేశం నిర్ణయించింది. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ -సమస్యలు , ఉపాధి – ఉద్యోగాలు, నిరంకుశ పాలన , పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, స్కూల్ విద్య, ఇంటర్ ,డిగ్రీ, టెక్నికల్ విద్య యూనివర్సిటీ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ,రైతులు, కూలీలు ఆదివాసీలు, గ్రామీణాభివృద్ధి : సామాజిక న్యాయం, మైనారిటీలు నీటి పారుదల –విద్యుత్తు , మహిళలు, ఇతర భిన్న లైంగిక వర్గాల సమస్యలు , గ్రామీణ,పట్టణ ఉపాధి హమీ పథకం, తెలంగాణ ప్రజల సాంఘిక బధ్రత , పర్యావరణ సమస్యలు –సంఘటిత ,అసంఘటిత కార్మికుల హక్కులు , మైనారిటీ ప్రజల హక్కులు లాంటి అంశాలపై ప్రత్యేక అవగాహనా పత్రాలను తయారు చేసి ప్రజల ముందు, రాజకీయ పార్టీల ముందు ఉంచాలని కమిటీ నిర్ణయించింది.

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ:

కన్వీనర్:
ప్రొఫెసర్ హరగోపాల్

కో కన్వీనర్స్ :

ప్రొఫెసర్ వినయ్ బాబు
ప్రొఫెసర్ సమున్నత
మైసా శ్రీనివాస్
కె. సజయ
సలీం పాషా
కరుణాకర్ దేశాయి
అంబటి నాగయ్య
కన్నెగంటి రవి

రాష్ట్ర కమిటీ సభ్యులు :

ప్రొఫెసర్ పి. ఎల్. విశ్వేశ్వర రావు –ఉస్మానియా యూనివర్సిటీ
ప్రొఫెసర్ రమా మెల్కొటే –ఉస్మానియా యూనివర్సిటీ
ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ –కాకతీయ యూనివర్సిటీ
డాక్టర్ కె. బాబూరావు – పర్యావరణ వేత్త,
హక్కుల ఉద్యమ నాయకులు
డాక్టర్ రవీంద్ర సూరి – సామాజిక కార్యకర్త
డాక్టర్ ఎం. వేణు గోపాల్ – సామాజిక కార్యకర్త
డాక్టర్ కుల శేఖర్ – సామాజిక కార్యకర్త
పాశం యాదగిరి –సీనియర్ జర్నలిస్ట్
ఎస్. సుధాకర్ – సీనియర్ జర్నలిస్ట్
Adv. బి.కొండారెడ్డి – న్యాయవాది,
Adv. జి. జగన్నాథం –న్యాయవాది
గురువా రెడ్డి – ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం
ప్రొఫెసర్ కొండా నాగేశ్వర రావు –ఉస్మానియా యూనివర్సిటీ
ప్రొఫెసర్ మాగి వెంకన్న – ఉస్మానియా యూనివర్సిటీ
అనిశెట్టి శంకర్ – ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
బి.కొండల్ రెడ్డి – –ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
వేణు గోపాల్ – – ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
రమణ –- ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
రఘునందన్ – ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
ఎస్. పూర్ణ చందర్ రావు , ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు
భాస్కరన్న – TJAC నాయకులు
ఆశాలత –సామాజిక కార్యకర్త
డాక్టర్ ఉషా సీతాలక్ష్మి – పరిశోధకులు
ఖలీదా ఫర్వీన్ – సామాజిక కార్యకర్త
సంజీవ్ –సామాజిక కార్యకర్త
DSSR కృష్ణ – తెలంగాణ విద్యావంతుల వేదిక
చంద్ర శేఖర్ – తెలంగాణ విద్యావంతుల వేదిక
పందుల సైదులు – తెలంగాణ విద్యావంతుల వేదిక
కె.రవీందర్ గౌడ్ – తెలంగాణ విద్యావంతుల వేదిక,
ఆరెపల్లి.విజయ్ కుమార్ – తెలంగాణ విద్యావంతుల వేదిక
చిర్రా రవి – తెలంగాణ విద్యావంతుల వేదిక,ఖమ్మం
రామగిరి ప్రకాష్ – తెలంగాణ విద్యావంతుల వేదిక
ఎండి ఖలీల్ – TFTU రాష్ట్ర నాయకులు
కె. శ్రీనివాస్ రావు – TFTU నాయకులు
సామ్రాజ్యం –తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు
గోపాల్ – రైతు ఉద్యమ నాయకులు
వెంకటయ్య – TVVU నాయకులు
వినోద్ కుమార్ – సంచార జాతుల సంఘం
ఎం. ఆశప్ప – భూసేకరణ బాధితుల సంఘం
స్వదేశ పరికపండ్ల – ప్రవాసీ కార్మికుల సంఘం
పి. ప్రభాకర్ -RTC నాయకులు
లాలయ్య –RTC నాయకులు
ముత్తయ్య –రైల్వే JAC నాయకులు

మరిన్ని వివరాలకు :

అంబటి నాగయ్య, కో కన్వీనర్, ఫోన్: 99669 89579
కన్నెగంటి రవి , కో కన్వీనర్ , ఫోన్: 99129 28422