HomeNationalCrime

యోగి కి రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు…’మమ్ములను లైంగికంగావేధించిన ప్రిన్సిపాల్ RSS కార్యకర్త కాబట్టి పోలీసులు మమ్ములనే బెధిరిస్తున్నారు’

యోగి కి రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు…’మమ్ములను లైంగికంగావేధించిన ప్రిన్సిపాల్ RSS కార్యకర్త కాబట్టి పోలీసులు మమ్ములనే బెధిరిస్తున్నారు’

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే వివిధ సాకులతో 12 , 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలను తన కార్యాలయానికి

హర్యాణా మత దాడుల వెనక అసలు కుట్రను బైటపెట్టిన నిజనిర్దారణ బృందాలు
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇంత గొడవెందుకు, శపిస్తే సరిపోతుంది కదా !
ఎన్నికలకు ముందు పెరిగిన బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలు: అమెరికా సంస్థ రిపోర్ట్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ పాండే వివిధ సాకులతో 12 , 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలను తన కార్యాలయానికి పిలిపించి అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయన చేష్టల గురించి బైటికి మాట్లాడటానికి తాము చాలా భయపడ్డామని, కానీ చివరికి తమ‌ తల్లిదండ్రులకు చెప్పామని విద్యార్థినులు తెలిపారు.
ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యువతులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారని పోలీసులు తెలిపారు.

ప్రిన్సిపాల్ చేష్టల గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్లి అతనితో గొడవపడ్డారని బాలికలు లేఖలో పేర్కొన్నారు. తల్లిదండ్రులు , పాండే మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ప్రిన్సిపాల్ కు గాయాలయ్యాయి

పాఠశాల ఆస్తులపై అక్రమంగా చొరబడి తనపై దాడి చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ ప్రిన్సిపాల్ కౌంటర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

తమను పోలీసులు బెదిరించి గంటల తరబడి నిర్బంధించారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు.

“మేము నాలుగు గంటల పాటు పోలీసు స్టేషన్‌లో కూర్చోవలసి వచ్చింది” అని ఆదిత్యానాథ్ కు రాసిన‌
విద్యార్థినులు లేఖలో పేర్కొన్నారు. ఇకపై తమను తరగతులకు హాజరుకావద్దని పాఠశాల అధికారులు ఆదేశించారని వారు లేఖలో పేర్కొన్నారు.

ప్రిన్సిపాల్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS)కి చెందిన తమ‌ తల్లిదండ్రులు చెప్పారని, అందుకే అతనిపై చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

“అతని వేధింపులకు గురైన మేమంతా ఈ సమస్యను మీతో వ్యక్తిగతంగా చర్చించాలనుకుంటున్నాము” అని యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. “మిమ్మల్ని కలవడానికి, న్యాయం కోరడానికి మాకు, మా తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మేమంతా మీ కుమార్తెలమే.” అని లేఖలో రాశారు.

కాగా, విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్‌ని అరెస్టు చేసినట్లు పోలీసులు ఈరోజు తెలిపారు.
ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు ఘజియాబాద్ సీనియర్ పోలీసు అధికారి సలోని అగర్వాల్ తెలిపారు.