HomePoliticsAndhra Pradesh

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన‌ కేఏ పాల్

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన‌ కేఏ పాల్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ visakha steel plant ని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ KA

టాలీవుడ్ పెద్దల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం !
21,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన మలబార్ గ్రూప్
ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ visakha steel plant ని ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ KA Paul ఈ రోజు వైజాగ్ లో ఆమరణ దీక్ష hunger strike ప్రారంభించారు. సోమవారం లోపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఈ మధ్య ప్రకటించిన పాల్ ఆయన చెప్పినట్టుగానే వైజాగ్ లోని కన్వెన్షన్ సెంటర్ లో దీక్ష మొదలు పెట్టారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే తాను ప్రాణాలు ఇవ్వడానికికూడా సిద్దంగా ఉన్నానని పాల్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీతో సహా అన్నిపార్టీలుప్రజలను మోసం చేస్తున్నాయని, తాను మాత్రం నిజాయితీగా పోరాడుతున్నానని కేఏ పాల్ అన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవీటీకరణ ఆపక పోతే ఉద్యమం తీవ్రతరమవుతుందని ఆయన హెచ్చరించారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పాల్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్బ్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నిరాహార దీక్ష కూడా చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. పైగా ఆయన నిరాహార దీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన బ్యానర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖ పార్లమెంటు స్థానం అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ అని పేర్కొన్నారు.