ఈ రోజు ఖమ్మంలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరైన సభ మరో సారి బీఆరెస్ , బీజేపీల దోస్తీని బైటపెట్టిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ రోజు ఖమ్మంలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరైన సభ మరో సారి బీఆరెస్ , బీజేపీల దోస్తీని బైటపెట్టిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరోపించడం వెనక అసలు కథ ఏంటి ?
బీఆరెస్, బీజేపీలు బైటికి కొట్లాడుకుంటున్నట్టు నటిస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పంద ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాం,గ్రెస్ లో చేవ్రిన సందర్భంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హాజరైన జనగర్జన సభను విఫలం చేయడానికి బీఆరెస్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు రెంట్ కు ఇవ్వడానికి అంగీకరించలేదు. అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను, పొంగులేటి అనుచరులను, ప్రజలను ఖమ్మం రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించిది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఆ సంఘటనను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ రోజు అమిత్ షా సభకు బీఆరెస్ ప్రభుత్వం ఎలా సహకరించిందో వివరిస్తోంది.
ఈ రోజు ఖమ్మంలో జరిగిన అమిత్ షా సభకు ప్రజలను తరలించేందుకు, ఆ సభను విజవంతం చేసేందుకు ఆర్టీసీ బస్సులను ఇచ్చింది. సభకు ఏ అడ్డంకులు కల్పించకుండా సజావుగా జరిగేట్టు ప్రభుత్వం చూసుకుంది. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి రుజువు కాదా అని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఇరు పార్టీల మధ్య ఒప్పందం బైటికి తెలవకుండా, ప్రజలకు అనుమానం రాకుండా ఉండేందుకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు నటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.