HomeTelanganaPolitics

మూడు నెలల మంత్రిగా ‘పట్నం’ ప్రమాణస్వీకారం

మూడు నెలల మంత్రిగా ‘పట్నం’ ప్రమాణస్వీకారం

రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మంత్రి పదవి కట్టబెట్

రేపు విచారణకు రావాలి… కవితకు ED నోటీసులు
వచ్చే అసె‍ంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థులు: KCR ఫైనల్ చేసిన లిస్ట్ ఇదేనా?
హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ

రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రోజు మధ్యహ్నాం 3 గంటలకు రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ (CM KCR), పలువురు మంత్రులు హజరయ్యారు.

గత ఎన్నికల్లో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. అయితే తర్వాత రోహిత్ రెడ్డి బీఆరెస్ లో చేరారు. కేసీఆర్ పట్నం కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ మహేందర్ రెడ్డి కొంత కాలంగా అసంత్రుప్తిగా ఉంటున్నారు.

మొన్న కేసీఆర్ ప్రకటించిన బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ లో పట్నం పేరు లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రంగా రెడ్డి జిల్లా మంచి పట్టున్న పట్నం బీఆరెస్ నుంచి వెళ్ళిపోతే నష్టం చవిచూడాల్సి వస్తుందని భావించిన కేసీఆర్ హడావుడిగా ఆయన ఒక్కడి కోసమే మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు.