HomeUncategorized

మహిళలపై బిజెపి దాడి. మహిళలనుఅవమానించడం తగదు .బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు

మహిళలపై బిజెపి దాడి. మహిళలనుఅవమానించడం తగదు .బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు

మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయం

ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి
పేటీఎం ఆ సేవలు రద్దు .రిజర్వ్ బ్యాంక్ తీవ్ర చర్యలు.
ఘనంగా నేలకొండపల్లి లో వై.యస్.రాజశేఖర్ రెడ్డి 14 వ వర్థంతి

మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి

కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు

అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి

ట్విట్టర్లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు

హైదరాబాద్: మహిళలపై దాడి చేయడం ఆపాలని బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

ట్విట్టర్లో తెలంగాణ బిజెపి చేసిన ఓ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు..

కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలలో అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బిజెపి ఓర్వలేక పోతుందా అని అడిగారు.

మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బిజెపిని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.