ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ములుగు జిల్లా ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి (29)ని అధికార బీఆర్‌ఎస్ ప్రకటించింది. నాగజ్యోతి, 2018 ల
ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ములుగు జిల్లా ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి (29)ని అధికార బీఆర్‌ఎస్ ప్రకటించింది. నాగజ్యోతి, 2018 లో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్ కుమార్తె.
జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)లో ఎమ్మెస్సీ (బోటనీ), బీఈడీ పూర్తి చేసింది. 2019లో ఆమె గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్)లో చేరి తాడ్వాయి మండలం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందారు.
ఆమె తండ్రి నాగేశ్వర్ రావు మావోయిస్టు పార్టీ నాయకుడు. ఈ ప్రాంతంలోని గిరిజనుల నుండి చాలా మద్దతు పొందారు. అతను 2018లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అది బూటకపు ఎన్ కౌంటర్ అని, పోలీసులు పట్టుకొని చంపేశారని అప్పట్లో మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నాగజ్యోతి మామ బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం తెలంగాణలో CPI మావోయిస్టు పార్టీకి యాక్షన్ టీమ్ కమాండర్.
సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సీతక్క కొన్నేళ్లు జనశక్తి లో పనిచేశారు. ఆమె 1997లో పోలీసులకు లొంగిపోయింది. ఆ తరువాత తన చదువును కొనసాగించి న్యాయవాదిగా మారింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసింది.
ములుగు నియోజకవర్గంలో ప్రధాన ఓటర్లుగా ఉన్న కోయ సామాజికవర్గం మద్దతును కూడగట్టే ఎత్తుగడగా నాగజ్యోతిని బరిలోకి దింపాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.