HomeNationalCrime

రెండు కుక్కల కొట్లాట…యజమానుల గొడవ… ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

రెండు కుక్కల కొట్లాట…యజమానుల గొడవ… ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం రెండు పెంపుడు కుక్కల మధ్య గొడవ ఇద్దరి మరణానికి, ఆరుగురు గాయాలపాలవడానికి దారి తీసింది. ఇండోర్ లోని ఖజ్రానా పోలీ

ప్రియాంకా గాంధీపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ …ఆమెపై కేసు నమోదు… ఎందుకంటే …?
బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?
టమాటా కథలు: కూరలో రెండు టమాటాలు వేసిన భర్త… కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన భార్య‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం రెండు పెంపుడు కుక్కల మధ్య గొడవ ఇద్దరి మరణానికి, ఆరుగురు గాయాలపాలవడానికి దారి తీసింది.

ఇండోర్ లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణా బాగ్ కాలనీలో రాజ్‌పాల్ సింగ్ రజావత్, విమల్ అమ్చా అనే ఇద్దరు నివసిస్తున్నారు. రజావత్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా, ఆచల్ కు కటింగ్ షాపు ఉంది. వీరిద్దరూ కుక్కలను పెంచుకుంటున్నారు.

గురువారం రాత్రి వీరిద్దరూ తమ పెంపుడు కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్ళారు. ఎదురుపడ్డ ఆ రెండు కుక్కలు ఒకదానిపై ఒకటి ఫైటింగ్ కు వెళ్ళాయి. ఒకదానిపైకి మరొకటి దూసుకెళ్ళాయి. దాంతో కుక్కల యజమానులైన రజావత్,ఆచల్ మధ్య గొడవ ప్రారంభమైంది. అది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆవేశానికి లోనైన రజావత్ తన ఇంట్లోకి వెళ్ళి తుపాకీ తీసుకొని తన బాల్కనీ నుంచి ఆచల్ పైకి కాల్పులు జరిపాడు. రజావత్ జరిపిన కాల్పుల్లో ఆచల్ తో సహా పక్కనే ఉన్న అతని బావ రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పాయాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో గర్భవతి అయిన రాహుల్ వర్మ భార్య జ్యోతి వర్మ కూడా ఉందని పోలీసులు తెలిపారు.

“రాజ్‌పాల్ సింగ్ రజావత్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. పెంపుడు కుక్కల గురించి వాగ్వాదం కారణంగా ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాలనీలో తన లైసెన్స్ ఉన్న‌ తుపాకీతో కాల్పులు జరిపాడు” అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ తెలిపారు.

పోలీసులు రజావత్, అతని కుమారుడు సుధీర్‌తో పాటు మరో బంధువు శుభమ్‌ను అరెస్టు చేశారు. వారిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ హత్యలతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు కుక్కలు పోట్లాడుకుంటూ విమల్ అమ్చా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు వాటిని తరిమికొట్టడంతో గొడవ తీవ్రమైందని పొరుగున ఉండే పల్లవి బోర్సే పేర్కొంది.

“మా లేన్‌లోని రెండు పెంపుడు కుక్కలు ఒకదానితో ఒకటి గొడవపడటం ప్రారంభించాయి. అవి గొడవ పడుతూ అమ్చా ఇంట్లోకి ప్రవేశించడంతో అతని సోదరుడు ప్రమోద్ రాజావత్ కుక్కను కర్రతో తరిమికొట్టాడు. వెంటనే వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ” అని ఆమె అన్నారు.