HomeNationalCrime

ఇంత దారుణమా ? హిందూ, ముస్లింలు స్నేహం కూడా చేయొద్దా ?

ఇంత దారుణమా ? హిందూ, ముస్లింలు స్నేహం కూడా చేయొద్దా ?

తీవ్ర మనోవేదనకు గురిచేసే సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందులో ఒక ముస్లిం యువకుడిని ఓ హిందూ గుంపు దారుణంగా కొట్టారు. వీళ్ళ ఈ క్రూరత్వానికి కారణం

ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్
అధికార పార్టీ అండ: యూనివర్సిటీ VC, అధికారులు, పోలీసులను చితకబాదిన ABVP గ్యాంగ్
రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి

తీవ్ర మనోవేదనకు గురిచేసే సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందులో ఒక ముస్లిం యువకుడిని ఓ హిందూ గుంపు దారుణంగా కొట్టారు. వీళ్ళ ఈ క్రూరత్వానికి కారణం ఆయువకుడు హిందూ యువతితో స్నేహంగా ఉండటమే.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. వీడియోలలో, ఎర్రటి చొక్కా ధరించిన ఒక వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా ముస్లిం యువకుడిని కొడుతున్నాడు. అతన్ని కొట్టవద్దని హిందూ యువతి వేడుకున్నప్పటికీ ఆ మూక దాడి మాత్రం ఆపలేదు.

ఆ యువకుడి, యువతి రోదనలు చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఆ గుంపులో ఏ మాత్రం చలనాన్ని, జాలిని కలిగించలేదు. పైగా యువతిని కూడా ఆ మూక బెధిరించింది. ఈ సంఘటన ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో జరిగింది. ఆ మూక యువకుడిని కొడుతున్నంత సేపు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అతని కొట్టుకుంటూ బలవంతంగా రైల్వే స్టేషన్ నుండి బయటకు తీసుకెళ్ళారు.

గందరగోళం మధ్య, గుంపులోని ఒక వ్యక్తి కెమెరాలో ఇలా ప్రకటించడం వినవచ్చు, “ఈ రోజు, మేము బాంద్రా టెర్మినస్ వద్ద ఒక మైనర్ హిందూ బాలికను రక్షించాము.” అని.

ఇంత దారుణం జరుగుతూ ఉంటే స్టేషన్ లోని రైల్వే పోలీసులు కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.