HomeTelanganaPolitics

విద్వేషపు ‘విశ్వగురువు’: మోడీ పాలనపై హైదరాబాద్‌లో రేపు పుస్తకం విడుదల

విద్వేషపు ‘విశ్వగురువు’: మోడీ పాలనపై హైదరాబాద్‌లో రేపు పుస్తకం విడుదల

మోడీ పాలనపై “విద్వేషపు ‘విశ్వగురు’ అనే పుస్తకాన్ని ఆగస్టు 5, 2023 సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ

హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు
ప్రేమించుకుందాం రా! కేసీఆర్ పై చంద్రబాబుకు లవ్ పెరిగిపోయింది

మోడీ పాలనపై “విద్వేషపు ‘విశ్వగురు’ అనే పుస్తకాన్ని ఆగస్టు 5, 2023 సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు.

సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రి ఎడిటర్, ప్రముఖ రచయిత ఎన్.వేణుగోపాల్ రచించిన ఈ పుస్తకాన్ని రచయిత, కాలమిస్ట్,’ ప్రైస్ ఆఫ్ మోడీ ఇయర్స్, అవర్ హిందూ రాష్ట్ర’ రచయిత ఆకార్ పటేల్ విడుదల చేస్తారు.
ఈ కార్యక్రమానికి సియాసత్ డైలీ మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ అలీఖాన్ అధ్యక్షత వహిస్తారు.
సాహితీ విమర్శకులు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి, ఐఏఎస్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.

మలుపు ప్రచురణల తరపున బాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతారు.