HomeUncategorized

కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత

కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత

భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డితో విభేదాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కారు.

‘హైడ్రా’ తో రేవంత్ పై తీవ్ర వ్యతిరేకత‌
కేసీఆర్ దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు 26న బీఆరెస్ పెద్దపల్లి జిల్లా ముఖ్యుల సమావేశం
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు

భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డితో విభేదాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి క్రితం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ వెళ్ళారు. అక్కడ ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎంపీ కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలతో తాను మనస్తాపానికి గురైనట్లు చెప్పారు.

తన ఇంట్లో ఐదారు సీట్లు తీసుకున్నప్పుడు ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడేమో బీసీలకు భువనగిరి టిక్కెట్ ఇవ్వాలంటూ జిల్లా పార్టీకి సమాంతరంగా సమావేశాలు పెడుతూ పార్టీ కేడర్ ను పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నారన్నారని ఆరోపించారురు.

అనిల్ కుమార్ బీఆరెస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్, శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ లు చెరో పదవి తీసుకొని పనిచేయాలన్నారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు పూర్తి హామీ తనదని,రు. తాను ఒక్క మాట చెప్పానంటే ప్రాణం పోయినా వెనక్కి పోనని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు.