HomeTelangana

పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం

పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలోని బిసీ లకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు,ర

పాపం కృష్ణ మాదిగ…అంతన్నారింతన్నారు….అద్దాల మేడన్నారు… చివరకు తుస్సుమనిపించిన మోడీ
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు -BRS ఎమ్మెల్యే సంజయ్
మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్

రాష్ట్రంలోని బిసీ లకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు,రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిందని ప్రభుత్వం పేర్కొంది..

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు.
మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని సిఎం అన్నారు.
భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునీ తహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.