HomeTelangana

తెలంగాణ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

తెలంగాణ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తె

‘బండి సంజయ్ ని చూసి బాత్ రూం లోకి వెళ్ళి బోరున ఏడ్చాను’
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ
తెలంగాణలో కుల గణనకు ముఖ్యమంత్రి ఆదేశం

తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం ట్వీట్ చేస్తూ, “రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. .”

శుక్రవారం నాడు మళ్ళీ పరిస్థిని సమీక్షించి శనివారం విద్యాసంస్థలకు సెలవు కొనసాగించాలా ఓపెన్ చేయాలా అనేది అధికారులు నిర్ణయిస్తారు.