ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial Intelligence (AI) ద్వారా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంటె జరుగుతుందనేది అర్దమవుతోంది. ఒకవైపు AI వల్ల అనేక మంది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial Intelligence (AI) ద్వారా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంటె జరుగుతుందనేది అర్దమవుతోంది. ఒకవైపు AI వల్ల అనేక మంది ఉద్యోగాలు ఊడి రోడ్డుపాలవుతుండగా మరో వైపు సైబర్ నేరగాళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని దోపిడికి తెగబడుతున్నారు.
కేరళకుKerala చెందిన రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ Andhrapradesh లో ఓ మిత్రుడు ఉన్నాడు. ఓ రోజు గుర్తు తెలియని నెంబర్ నుండి ఆ మిత్రుడు వాట్సప్ వీడియో కాల్ చేశాడు. తాను దుబాయ్‌లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బు అవసరమని పేర్కొంటూ, అర్జెంట్ గా రూ. 40,000కావాలని, భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. దాంతో రాధాకృష్ణన్ అతను చెప్పిన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మరో 35 వేల రూపాయలు కావాలని అడిగాడు. దాంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ లోని తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తానసలు ఫోనే చేయలేదని, తనకు డబ్బులు అవసరమే లేదని ఆ స్నేహితుడు చెప్పాడు. దాంతో తాను మోసపోయానని అర్దమైన రాధాకృష్ణన్ పోలీసు హెల్ప్ లైన్ కు పిర్యాదు చేశాడు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు, ఓ సైబర్ క్రైం నేరగాడు AI ద్వారా తన మొహాన్ని రాధాకృష్ణన్ స్నేహితుడి మొహంలా మార్చుకొని మోసం చేసినట్టు గుర్తించారు. వెంటనే చర్యలు చేపట్టిన కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్స్ వింగ్ మోసగాడి నుండి రూ. 40,000లను తిరిగి రాధాకృష్ణన్ కు ఇప్పించారు.
తెలియని వీడియో లేదా ఆడియో కాల్‌ల ద్వారా ఆర్థిక సహాయం కోసం ఎలాంటి అభ్యర్థనలకు స్పందించవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.