HomeTelanganaPolitics

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేది లేదా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరేది లేదా?

వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణనే తన రాజకీయ వేదికగా స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి వెళ్లబోనని చెప్పినట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. అందుకే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు షర్మిల వ్యవహారాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్
కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
BJP అబద్దాలు నార్త్ లో నమ్ముతారేమో కాని తెలంగాణలో నమ్మరన్న జిట్టా బాలకృష్ణారెడ్డి… పార్టీ నుంచి సస్పెండ్ చేసిన‌ బీజేపీ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఖమ్మంలో పాల్గొన్న సభకు ముందే పార్టీ విలీనంపై ఒక ప్రకటన వెలువడుతుందని అందరూ అంచనా వేశారు. ఇక జూలై 7న తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విలీన ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ షర్మిల కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలోనే పార్టీ అధిష్టానం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.

కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తెలంగాణ వేదికగానే తాను రాజకీయాలు చేస్తానని వైఎస్ షర్మిల చెబుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం షర్మిలను ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని అధిష్టానానికి రిపోర్టు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో గతంలో షర్మిల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకొని.. అధికార బీఆర్ఎస్ తప్పకుండా విమర్శలు చేస్తుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వైఎస్ షర్మిల వల్ల తెలంగాణలో మైనస్ అవుతామని ఆయన అధిష్టానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణనే తన రాజకీయ వేదికగా స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి వెళ్లబోనని చెప్పినట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. అందుకే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు షర్మిల వ్యవహారాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. షర్మిల కాంగ్రెస్‌లో చేరినా లోక్‌సభకు పోటీ చేయించాలని భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి.. ఆ తర్వాత షర్మిల విషయంపై నిర్ణయం తీసుకుందామని అధిష్టానం సూచించినట్లు తెలుస్తున్నది. అంటే అప్పటి వరకు షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరబోదనే సంకేతాలు పంపినట్లే అనే చర్చ జరుగుతోంది.

అప్పటి వరకు తన సొంత వైఎస్ఆర్టీపీ ద్వారానే తెలంగాణలో రాజకీయాలు చేసుకోవాలనే సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి వైఎస్ షర్మిల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. తెలంగాణ ఎన్నికల తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.