HomeNationalCrime

టమాటా దొంగల భయంతో వణికిపోతున్న రైతులు

టమాటా దొంగల భయంతో వణికిపోతున్న రైతులు

ఎందుకలా ? ప్రజలు అంతగా భయపడటానికి కారణమేంటి ? ఎందుకంటే… ఆ రైతులంతా టమాటాలు పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాల ధర కొండెక్కి కూర్చుంది. ఎప్పు

టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి
తమ పార్టీ అధ్యక్షుడిపై మండిపోతున్న రేవంత్ !
మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?

ఎందుకలా ? ప్రజలు అంతగా భయపడటానికి కారణమేంటి ? ఎందుకంటే… ఆ రైతులంతా టమాటాలు పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాల ధర కొండెక్కి కూర్చుంది. ఎప్పుడూ అప్పుపాలవుతున్న టమాటా రైతులు ఈ సారైనా అప్పుల ఊబిలోంచి బైటపడొచ్చని ఆశతో ఉన్నారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 దాటగా, కొన్నిచోట్ల కిలో రూ.150 కూడా పలుకుతోంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాల కారణంగా ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది.

అయితే సందెట్లో సడేమియా లాగా దొంగల కన్ను కూడా ఇప్పుడు బంగారం మీదకన్నా టమాటాల మీదే ఎక్కువగా పడింది. దాంతో లక్షల రూపాయల విలువచేసే టమాటాలను దోచుకపోతున్నారు.

హాసన్ జిల్లాలోని ధరణి అనే మహిళా రైతు పొలంలో రాత్రికి రాత్రే రూ.3 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన జూలై 6న హాసన్‌లోని హళేబీడు పట్టణానికి సమీపంలోని గోని సోమనహళ్లి గ్రామంలో జరిగింది. 3 లక్షల విలువైన 90 టమాట బాక్సులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ధరణి హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె కుటుంబం రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశారు. పంటను చిక్కమగళూరు మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ టమాటాలన్నీ గురువారం చోరీకి గురయ్యాయి.

టమాటా మొక్కలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. మరుసటి రోజు ఉదయం ధరణి తన పొలానికి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘‘ఏడెనిమిదేళ్లుగా టమాట పండిస్తున్నా.. పంటకు ఏనాడూ గిట్టుబాటు ధర రాలేదు.. ఈ ఏడాది బాగా పండింది, గిట్టుబాటు ధర వచ్చింది. అప్పులు తీర్చేద్దామనుకున్నాను కానీ ఆ సంఘటన నా ఆనందాన్ని పాడుచేసింది. ” అని ఆమె అన్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు రైతులు తమ పొలాల వద్ద నిద్రిస్తూ, కోతకు సిద్ధంగా ఉన్న పంటకు కాపలా కాస్తున్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. తమ వ్యవసాయ భూమి వద్ద టెంట్లను వేస్తున్నట్లు రైతులు వివరిస్తున్నారు. ఒక్క టమాటా పెట్టె రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు పలుకుతుండగా, మంచి పంట పండిన రైతులు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ఏళ్ల తరబడి రైతులు పండించిన పంటకు ఎప్పుడూ సరైన గిట్టుబాటు ధర లభించ లేదు. అప్పుడు వారు టమాటా ధరలు బాగా పడిపోవడాన్ని నిరసిస్తూ టమాటాలను రహదారులపై పడేసేవారు. చాలా వరకు రైతులకు రవాణా ఖర్చులు కూడా అంద లేదు. ఇప్పుడేమో పండించిన పంటకు మంచి ధర పలుకుతున్న తరుణంలో దొంగతనాల బెడద పెరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.