HomeTelanganaPolitics

బ‌డ్జెట్ మీద కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు

బ‌డ్జెట్ మీద కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు

బ‌డ్జెట్ మీద కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు హైదరాబాద్ నినాదం: యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబించిన రాష్ట్ర రెండో బ‌డ్జెట్‌ అని మంత్రి

ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్
‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’
రేపు మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాల వెల్లడి

బ‌డ్జెట్ మీద కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు

హైదరాబాద్ నినాదం: యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబించిన రాష్ట్ర రెండో బ‌డ్జెట్‌ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత‌న్న, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈ రోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల అవసరాలను గుర్తించి త‌గిన మేర‌కు కేటాయింపులు చేయ‌డం హ‌ర్ష‌ణీయమన్నారు. డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమ్మిళిత వృద్ధిని ప్రతిబింబింబిస్తుంద‌న్నారు.
ఒక వైపు అభివృద్ధి… మ‌రోవైపు సంక్షేమాన్ని సముతుల్య‌త చేస్తూ… రాష్ట్ర బడ్జెట్‌ దిశానిర్ధేశం చేసేలా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం చేకూర్చే విధంగా ఉంద‌ని… ఉపాధి కల్పనకు ఊతం ఇస్తూ… మహిళా సంక్షేమం, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచీలా ఉందన్నారు. యావ‌త్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌ను భ‌ట్టి విక్ర‌మార్క రూపొందించ‌డం ప్ర‌సంసానీయమని, స‌వాళ్ళ‌పై స్వారీ చేస్తూనే… రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆర్ధిక స్ధిరత్వానికి బాటలు వేస్తుందని, సురేఖ తెలిపారు. అసెంబ్లీ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన భ‌ట్టి విక్ర‌మార్క గారికి…. శాస‌న‌మండ‌లిలో ప్ర‌వేశపెట్టిన మంత్రి శ్రీధ‌ర్ బాబు గారికి ఈ సందర్భంగా మంత్రి అభినంద‌న‌లు తెలిపారు