HomeTelanganaPolitics

రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం వచ్చేది కాదు:రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం వచ్చేది కాదు:రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం వచ్చేది కాదు:రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాక

మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
సోనియాతో షర్మిల భేటీ…YSRTPలో పార్టీలో చిచ్చు…లైవ్ లో రాజీనామా చేసిన నాయకుడు
ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం

రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం వచ్చేది కాదు:రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదని, మీ ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీ కి తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని, వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చిందన్నారు. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదన్నారు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామని, సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశామని ఆయన వివరించారు. సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదన్నారు. కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టామని, న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించామని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీం గారిని నియమించామన్నారు. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని,
ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే… భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
ఇదొక గొప్ప అవకాశం.. ఇది పది అందరికీ ఉపయోగపడేలా చూడాలని, కుర్చీలో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండని ముఖ్యమంత్రి అన్నారు