ప్రాణం తీసిన ముర్మూరు మట్టి లారీన్యాయం కోసం రోడ్డుపై అఖిల పక్షనేతల ధర్నా గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు మట్టి లారీ ఓ అమాయకు
ప్రాణం తీసిన ముర్మూరు మట్టి లారీ
న్యాయం కోసం రోడ్డుపై అఖిల పక్షనేతల ధర్నా
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు మట్టి లారీ ఓ అమాయకుని ప్రాణం తీసింది.పెద్దంపేట్ గ్రామానికి చెందిన మేరుగు కుమార్(45) అనే వ్యక్తి శనివారం ఉదయం పెద్దంపేట నుండి అంతర్గాం వైపు వస్తుండగా, అదే సమయంలో బుగ్గరోడ్డు వైపునుండి అతివేగంగా వస్తున్న మట్టిలారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని చౌరస్తాలో జరిగింది. తీవ్రంగా గాయాలు కావటంతో మృతుడు కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.కాగా పూర్తి రవాణా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ తో నెమ్మదిగా వస్తున్న కుమార్ ను మట్టి కాంట్రాక్టర్లు పొట్టనపెట్టుకున్నారని అఖిల పక్షనేతలు రోడ్డుపై బైటాయించి ధర్నాకు దిగారు.దొంగ మట్టిని తొందరగా ఎత్తుకెళ్లాలనే ఉద్దేశంతో కాంట్రాక్టరు చేస్తున్న ఒత్తిడిమేరకే డ్రైవర్లు లారీలను అతివేగంగా నడుపుతున్నారని,దీనికి కారకులైన వారిని శిక్షించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక హరి,కాంగ్రెస్ నేత పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.