HomeTelanganaPolitics

రేపు మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాల వెల్లడి

రేపు మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాల వెల్లడి

: రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది .సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన మంత్రి

ముందుకు సాగుతున్న కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీల్ అమధ్య పొత్తు చర్చలు
మనం కూడా పనుల మీద కాకుండా ప్రచారం మీద దృష్టి పెడితే గెలిచేవాళ్ళం – KTR
తెలంగాణలో కారుదే జోరు – స్పష్టం చేసిన తాజా సర్వే రిపోర్ట్స్

: రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది .సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండో దశ సమగ్ర కులగణనకు మంత్రిమండలి ఆమోదించనుందని సమాచారం.

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్.. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్‌లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్‌లో స్పష్టత రానుంది. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి హస్తినలో ప్రధానితో సమావేశం, ఏపీతో నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.