తెలంగాణ మట్టే ఆయన జీవితం. నినాదం .హైదరాబాద్: కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. ఆశల రుతువులో నమ్మకాల మబ
తెలంగాణ మట్టే ఆయన జీవితం.
నినాదం .హైదరాబాద్: కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకొని బతుకును చిగురింపజేసుకొనే నిరంతర వసంతకాల అన్వేషి ఆయన.. తెలంగాణ మట్టే ఆయన జీవితం. దీన్ని మాగాణం చేయడమే ఆయన ధ్యేయం. ఈ భూమిలో ఆయన విత్తు అయ్యారు.. మొక్క అయ్యారు.. చెట్టు అయ్యారు.. మహా వృక్షమై ఎదిగి వచ్చారు. నెర్రెలు వారిన నేల గొంతులు తడిపారు. పల్లమెరిగిన గోదావరి అడుగు మరల్చి తన భూమితల్లిని మాగాణం చేశారు. స్వరాష్ట్రంలో జలసిరులతో.. భూమితల్లి పచ్చని పట్టుచీర కట్టుకొని గజ్జె కట్టి ఆడిన సవ్వడులు విని ఏనాడో అన్నింటినీ వదిలి వెళ్లిన అన్నదాతలు.. తమ మట్టి కోసం మళ్లీ దండుకట్టి తిరిగి వచ్చారు. వారి అడుగులకు కేసీఆర్ ముందడుగై నడిచారు. బంగారు తెలంగాణ వైపు ప్రస్థానం సాగించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ దాస్యాన్ని విముక్తం చేశారు. బీడు భూమి ఎండిన కాలం మీద సగర్వంగా ఎగిరిన జెండా అతడు. కాళేశ్వరం ప్రాజెక్టు శిఖరం పైనుంచి ‘నేనురా తెలగాణ నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను’ అని ఎలుగెత్తి
నినదించిన వీరుడు.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఏడు వసంతాల నిండు జీవితంతో సప్తతి మహోూత్సవాన్ని జరుపుకొంటున్న నాయకుడు కేసీఆర్, శత్రువుకు కూడా శుభం కలుగాలని కోరుకోగల స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడు కేసీఆర్. ఆయన నడక, నడవడిక ఒక స్ఫూర్తి, ఆయన కార్యదక్షత ఒక మార్గదర్శకత్వం. నేటి దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి నేత లేరనడంలో సందేహం లేదు. ఆశలు కోల్పోయి, అన్ని రకాలా ఆగమైపోయి, అనేక ఇబ్బందుల పాలై, వలసలు, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో గుండె దిటవు చేసుకొని, గుప్పెడు మందిని వెంటపెట్టుకొని కాలికి బలపం కట్టుకొని అడుగు ముందుకు వేసిన నేత కేసీఆర్, తెలంగాణ అంతటా పక్షిలాగా తిరిగారు. ప్రజలను జాగృతం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తలుపు తట్టారు. తెలంగాణ అనివార్యతను తెలియజేసి అనేక పార్టీల మద్దతు కూడగట్టారు. సైలెన్స్ ఈజ్ మోర్ వయలెన్స్ అన్న మాట కేసీఆర్ విషయంలో నిజమవుతుందనే చెప్పాలి. కేసీఆర్ రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు చాలామందికి అర్ధం కావు, ఫిడెల్ కాస్ట్రో మీద అమెరికా సుమారు 600 సార్లు
హత్యాయత్నం చేసిందని వార్తలు విన్నాం. కానీ, కేసీఆర్పై తెలంగాణలోని తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణేతరులు ప్రతిరోజూ, ప్రతిక్షణం కుట్రలు చేస్తూనే ఉన్నారు.. ఉంటారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడాన్నే నిషేధించిన దురవస్థ నుంచి పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచే తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా రాజకీయమే చేయలేని పరిస్థితికి ఉమ్మడి ఆంధ్ర రాజకీయ యవనికను కేసీఆర్ మార్చేశారు. అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ప్రతి నాయకుడూ తెలంగాణ గురించి మాట్లాడాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితమైన లక్ష్యాలు పెట్టుకొని పనిచేశారు. తెలంగాణ సోయితో నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైన్, రీ ఇంజినీరింగ్ చేశారు. ప్రాజెక్టులకు అనుసంధానంగా చెరువుల పునరుద్ధరణ చేశారు. నీటిపారుదల శాఖను సరికొత్తగా రూపాంతరం చేశారు. రైతాంగానికి ధైర్యం కల్పించారు. తెలంగాణ తనను తాను పాలించుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. కానీ, తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆరే ఆ కలను కన్నాడు.. సాకారం చేశాడు. యాసంగిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలంగాణలో ఏ రైతూ ఊహించలేదు. కానీ.. కేసీఆర్ ప్రతి రైతు చేతా సాధించి చూపించారు. సముద్ర మట్టానికి 690 అడుగుల పైపైకి గోదారమ్మ ఉబికి వస్తుందని పరాచికానికి కూడా ఎవరూ మాట్లాడుకోలేదు. కానీ, అంతెత్తున ఏ నదీ లేని చోట 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ కట్టి గోదారమ్మను ఎగువకు పరుగులు పెట్టించి.. ఇప్పుడు రాజధానికి నీళ్లివ్వడానికీ ఆధారపడేలా చేశారు. 11 ఏండ్ల క్రితం తెలంగాణది దుర్భర పరిస్థితి. అనేక అనుమానాలు, అవమానాలు.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణను శిఖరస్థాయిలో నిలిపారు కేసీఆర్, ఇవాళ కేసీఆర్ అధికారంలో లేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇది సత్యం. సప్తవసంతాల తెలంగాణ స్వాప్నికుడికి హృద యపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,
సంకల్ప దీప్తి.. తెలంగాణ ఘనకీర్తి
తెలంగాణ మట్టే ఆయన జీవితం.
కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఆయనకే తెలుసు. ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకొని బతుకును చిగురింపజేసుకొనే నిరంతర వసంతకాల అన్వేషి ఆయన.. తెలంగాణ మట్టే ఆయన జీవితం. దీన్ని మాగాణం చేయడమే ఆయన ధ్యేయం. ఈ భూమిలో ఆయన విత్తు అయ్యారు.. మొక్క అయ్యారు.. చెట్టు అయ్యారు.. మహా వృక్షమై ఎదిగి వచ్చారు. నెర్రెలు వారిన నేల గొంతులు తడిపారు. పల్లమెరిగిన గోదావరి అడుగు మరల్చి తన భూమితల్లిని మాగాణం చేశారు. స్వరాష్ట్రంలో జలసిరులతో.. భూమితల్లి పచ్చని పట్టుచీర కట్టుకొని గజ్జె కట్టి ఆడిన సవ్వడులు విని ఏనాడో అన్నింటినీ వదిలి వెళ్లిన అన్నదాతలు.. తమ మట్టి కోసం మళ్లీ దండుకట్టి తిరిగి వచ్చారు. వారి అడుగులకు కేసీఆర్ ముందడుగై నడిచారు. బంగారు తెలంగాణ వైపు ప్రస్థానం సాగించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ దాస్యాన్ని విముక్తం చేశారు. బీడు భూమి ఎండిన కాలం మీద సగర్వంగా ఎగిరిన జెండా అతడు. కాళేశ్వరం ప్రాజెక్టు శిఖరం పైనుంచి ‘నేనురా తెలగాణ నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను’ అని ఎలుగెత్తి