HomeTelanganaUncategorized

చైర్మన్ వేదింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం…!

చైర్మన్ వేదింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం…!

చైర్మన్ వేదింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం…! •గత ఆరు నెలలుగా వేధిస్తున్నారంటూ ఉద్యోగి ఆరోపణ… •ఏటువంటి ఒత్తిడికి గురి చేయలేదు కావాలనే ఆ

డ్రగ్స్ వ్యవహారం: హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు
‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌
గ్రామంపై దాడి,ప్రజలపై హింస, సామూహిక అత్యాచారాలు: 215 మంది పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు జైలు శిక్ష‌

చైర్మన్ వేదింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం…!

•గత ఆరు నెలలుగా వేధిస్తున్నారంటూ ఉద్యోగి ఆరోపణ…

•ఏటువంటి ఒత్తిడికి గురి చేయలేదు కావాలనే ఆరోపణలు… చైర్మన్ రామారావు…

కోదాడ,నినాదం:
పిఎసిఎస్ చైర్మన్ వేధింపులకు గురి చేస్తున్నారని పిఎసిఎస్ ఉద్యోగి ఆరోపిస్తూ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయతనానికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.బోరవెల్లి సుధాకర్ రెడ్డి మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గత ఆరు నెలలుగా సంఘం చైర్మన్ తన విధులను నిర్వహించకుండా ఇబ్బందులరు గురి చేస్తున్నారని, తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించకుండా మానసికంగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ తన పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. గమనించిన స్థానికులు స్థానిక సి హెచ్ సీ కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వివరణ…
నాలుగు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు..

•పీఏసీఎస్ చైర్మన్ కొల్లు రామారావు…

సుధాకర్ రెడ్డిని ఎటువంటి వేధింపులకు గురి చేయలేదు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. సుధాకర్ రెడ్డి తల్లి ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో గల నాలుగు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. ఆరోగ్యం క్షీణించిన ఆమె మృతి చెందిన అనంతరం అతని ఆరోగ్యం బాగోలేదని చెప్తూ ఉద్యోగం లోకి చేరలేదు.