HomeTelanganaUncategorized

కనపడని ఆరుగురు గురుకుల విద్యార్థులు…?

కనపడని ఆరుగురు గురుకుల విద్యార్థులు…?

కనపడని ఆరుగురు గురుకుల విద్యార్థులు…? టీచర్ మందలించడంతోనే విద్యార్థులు బయటికి వెళ్లారని తల్లిదండ్రుల ఆరోపణ..? రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చ

BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి
BRSలోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి.. కేసీఆర్ తో సమావేశం
ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!

కనపడని ఆరుగురు గురుకుల విద్యార్థులు…?

టీచర్ మందలించడంతోనే విద్యార్థులు బయటికి వెళ్లారని తల్లిదండ్రుల ఆరోపణ..?

రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

కోదాడ ,నినాదం
కోదాడ మండలం మునగాల@నెమలిపురి ఆర్ ఆర్ &ఆర్ సెంటర్లో నడపబడుతున్న గురుకుల పాఠశాల నుండి పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదు. ఆదివారం ఉదయం 11 గంటల నుండి విద్యార్థులు కనపడకపోయిడంతో సాయంత్రం ఏడు గంటలకు విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటా హుటిన పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపల్ అడగగా మాకు తెలియదంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి వరకు కూడా విద్యార్థులు రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ చేస్తుండగా విద్యార్థులు తలుపులు కొడుతున్న నేపథ్యంలో టీచర్ మధులించడంతోనే ఆదివారం ఉదయం బయటకు వెళ్లినట్లుగా తోటి విద్యార్థులు చెబుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. టీచర్ మందలించడంతోనే బయటకు వెళ్లారా లేక ఇతర కారణాలవల్ల ఏమైనా బయటికి వెళ్లారా అనేది అర్థం కాని పరిస్థితి. తల్లిదండ్రులు విద్యార్థులు కనపడకపోవడంతో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.