HomeTelanganaUncategorized

నడిగూడెం కోటలోనే మువ్వన్నెల జెండా రూపకల్పన…మువ్వన్నెల పతాకం మొగ్గతొడిగిన నడిగూడెం కోట

నడిగూడెం కోటలోనే మువ్వన్నెల జెండా రూపకల్పన…మువ్వన్నెల పతాకం మొగ్గతొడిగిన నడిగూడెం కోట

నడిగూడెం కోటలోనే మువ్వన్నెల జెండా రూపకల్పన… •మువ్వన్నెల పతాకం మొగ్గతొడిగిన నడిగూడెం కోట కోదాడ(నినాదం):భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమా

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు
గద్దర్ కన్నుమూత‌
హైదరాబాద్ కు రెడ్ ఎలర్ట్

నడిగూడెం కోటలోనే మువ్వన్నెల జెండా రూపకల్పన…

•మువ్వన్నెల పతాకం మొగ్గతొడిగిన నడిగూడెం కోట

కోదాడ(నినాదం):
భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకం రూపుదిద్దుకున్నది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని రాజావారి కోటలోనే. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు, చరితార్థుడు పింగళి వెంకయ్య…. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ వారిని తరిమికొట్టేందుకు దేశాన్నంతటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఒక జెండా ఉండాలని మహాత్మాగాంధీ తలంచారు. ఎందరో మేధావులు రకరకాల జెండాలను అప్పుడు జరుగుతున్న సమావేశాలు, సభల్లో మహాత్ముడికి చూపించారు. అయితే పింగళి వెంకయ్య రూపొదించిన జెండా గాంధీజీని ఆకర్షించింది.నడిగూడెం రాజా వారి కోటలో జమిందారు రాజనాయిని వెంకటరంగరావు జమానా లో 1909 నుంచి 1929 వరకు వ్యవసాయ అధికారిగా పని చేసిన పింగళి వెంకయ్య ఈ కోటలోనే జాతీయ జెండా రూపొందించాడు. 1913 నుంచి జాతీయ జెండాకు నమునాలు మొదలు పెట్టగా 1916 లో లక్నోలో, 1919లో జలంధర్‌లో నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తెలుపు, ఆకుపచ్చ, కాషాయం రంగులతో మధ్యలో నూలు ఒలికే రాట్నంతో రూపొందిన జాతీయ జెండాను 1921 మార్చి 31 ఏప్రిల్‌ 1న అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్న నాటి బెజవాడ( విజయవాడ)లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను జాతిపిత మహ్మా త్మాగాంధీ ఆమోదించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన మువ్వెన్నల జెండా 1947 స్వాతంత్య్రం అనంతరం నెహ్రూ సమక్షంలో జరిగిన రాజ్యాంగసభలో మూడు రంగుల జెండాలోని నూలు ఒలికే రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో ఆశోకచక్రాన్ని చేర్చి అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాకు వందేళ్లకు పైగా పూర్తయినా నేటికీ వెంకయ్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం జాతీయ పతాక శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి ముందు రాకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పింగళిని గుర్తించని ప్రభుత్వాలు..

నడిగూడెం కోటలో జాతీయ జెండా రూప కల్పన జరిగి వందేళ్లు పైగా నిండినా పింగళికిగాని చారిత్రక నేపథ్యం ఉన్న కోటకుగాని గుర్తింపు లేకుండా పోయింది. గడిలో పింగళి విగ్రహం కాని, ఆయన పేరిట మ్యూజియంగాని ఏర్పాటు చేయలేదు. జమిందారు వారసులు నగరాలకు వలసవెళ్లారు. 2007లో పింగళి పేర రూ.5 ల స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా అది ఇక్కడ వాడుక లో లేదు. ప్రపంచ ఖ్యాతి కలిగిన కోట విశిష్టతను నడిగూడెం చరిత్రను భావితరాలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

‘పత్తి’ వెంకయ్య.. పతాక శిల్పి

కృష్ణా జిల్లా మువ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు. జర్మనీలో పీహెచ్‌డీ చేశా రు. గనులు, వజ్రాల శాస్త్రంలో నిపుణుడైన ఆయన ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేస్తుండే వారు. నడిగూడెం జమిందారు రాజ నాయిని వెంక టరంగారావు బారిస్టర్‌ చదువులు, కోర్టు కేసులు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తూ ఆధునిక వ్యవ సాయ గ్రంథాలను రచించారు. ఆ కాలంలో మహత్మాగాంధీతో ఉన్న ఉద్యమ నేపథ్యం పింగిళికి రాజావారి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో 1909 లో రాజావారు పింగిళిని నడిగూడెం కోటకు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో నూతన పత్తి వంగడా ల సాగుపై రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించారు. రైతులను ఆధునిక సాగు వైపు చైత న్యం చేస్తూ పత్తి వెంకయ్యగా పేరు గాంచిన పింగళిని వ్యవసాయాధికారిగా జమిందారు నియమించారు. అప్పటి నుంచి 1929 వరకు ఇక్కడే పనిచేశారు. జాతీయ జెండాకు కోటలోనే రూప కల్పన చేశారు.