మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆయన విగ్రహం ఏర్పాటు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం అసెంబ్లీ స్పెషల్ సెషన్ మా
మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆయన విగ్రహం ఏర్పాటు
తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
అసెంబ్లీ స్పెషల్ సెషన్
మాజీ ప్రధాని మన్మోహన్‌కు సంతాపం తెలిపిన సీఎంమన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభం అవ్వగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానం గురించి ప్రస్తావిస్తూ లీడర్ ఆఫ్ ది హౌస్ సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరారు.
అనంతరం సీఎం రేవంత్ మాజీ ప్రధాని మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని చెబుతూ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు మాజీ ప్రధాని భారతదేశానికి అందించిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్థిక వ్యవస్థను దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును సీఎం రేవంత్ ప్రశంసించారు.