HomeUncategorized

ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన మన్మోహన్..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన మన్మోహన్..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన మన్మోహన్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్: నినాదం ప్రతినిధి.ప్రపంచీకరణతో భారత్ ను తిరుగ

విద్యార్థులు యువతకు నైపుణ్యమైన శిక్షణ..సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం
తుపాకీ నీడలో ‘మన్యం’
బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన మన్మోహన్

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: నినాదం ప్రతినిధి.ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దని రాష్ట్రమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
• ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని,
• ప్రధాని పి.వి సారథ్యంలో ఆర్థిక మంత్రిగా దేశానికి ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని ఆయన కొనియాడారు.
• ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదని,
• ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు.
• దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనదని,
• మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు.
• సహనశీలిగా, వివాదరహితుడిగా, నిత్యం చిరునవ్వుతో కనిపించేవాడని, డా. మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారని,
• దేశం ఒక గొప్ప ఆర్థిక నిపుణుడిని కోల్పోయిందని
• వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు