అలుగునూర్ లో కేసీఆర్ దీక్షాదీవాస్..లో కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకా
అలుగునూర్ లో కేసీఆర్ దీక్షాదీవాస్..లో కేటీఆర్
..కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం అసన్నమైందని, ఇందుకు ప్రజలందరు సంఘటితం కావాలని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అలుగునూర్ లో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్షా సభలో ఆయన మాట్లాడారు.అమలుకు నోచుకోని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరబడే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు.నప్రభుత్వ ఒంటెద్దు పోకడలను అడ్డకట్ట వేసేందుకు ప్రజలు మరో పోరాటానికి సిద్దం కావాలన్నారు. రేవంత్ అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తుంది కదా ఒక్కసారి ప్రలలోకి జనం నీకు ఏలా షాపనార్దాలు పెడుతున్నారో అర్థం అవుతుందన్నారు.ఎక్కడికైనా పోదాం ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలను ఓవైపు ప్రజలు చీదరించుకుంటున్నారని, అది చాలక కాంగ్రెస్ ప్రభుత్వ ఏముఖం పెట్టుకుని విజయటోత్సవాలు అర్థం కావడం లేదన్నారు.2001లో కేసీఆర్ టిఆర్ఎస్ ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని,చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగాడని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కొనియాడారు.తెలంగాణకు పునర్జన్మనిచ్చీంది కరీంనగర్ జిల్లాయేనని కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. సభలో పాల్గోన్న మాజీ మంత్రి,ఎంఎల్ఏ గంగుల కమలాకర్ మాట్లాడుతూ 2001లో ఉవ్వెత్తున ఎగసిన పడిన ఉద్యమానికి తలొగ్గే విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పలేదన్నారు.ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగాల పునాదులతో రాష్ట్రాన్నిసాధించిన ఘనత కేసిఆర్ తో పాటు తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసిఆర్ అడుక్కునే పరీస్థితి వస్తుండేదంటూ సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలీ గోటికి కూడా సరిపోడని కేటీఆర్ ఏద్దవా చేశారు. ఈ సభలో మాజీ రాజ్యసభ్యుడు బండ ప్రకాష్,మాజీ ఎంఎల్ఏ లు సంకే రవిశంకర్, రసమయి బాలరకిషన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు జివి రామ క్రష్ణారావు,జిల్లా పరిషత్ మాజీ చేర్ పర్సన్ కమనుల్ల విజయ, మాజీ సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రవిందర్ సింగ్ తదితరులు పాల్గోన్నారు.