HomeTelanganaUncategorized

స్మశానమే ఆమె ఆ”ని”వాసం..కన్న కొడుకులే కసాయిలు..

స్మశానమే ఆమె ఆ”ని”వాసం..కన్న కొడుకులే కసాయిలు..

స్మశానమే ఆమె ఆ"ని"వాసంకన్న కొడుకులే కసాయిలు.. పది రోజులుగా స్మశానంలోనేవృద్ధురాలు రాజవ్వ నరకం… జగిత్యాల, నవంబర్ 27 ( బ్యూరో చీఫ్) స్మశానమే ఆమె ఆ

‘బండి సంజయ్ ని చూసి బాత్ రూం లోకి వెళ్ళి బోరున ఏడ్చాను’
10 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు RSS నాయకుడి రాక‌
ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న కేసీఆర్

స్మశానమే ఆమె ఆ”ని”వాసం
కన్న కొడుకులే కసాయిలు..

పది రోజులుగా స్మశానంలోనే
వృద్ధురాలు రాజవ్వ నరకం…

జగిత్యాల, నవంబర్ 27 ( బ్యూరో చీఫ్) స్మశానమే ఆమె ఆ”ని”వాసం అయింది.. మానవత్వం మరిచారు..కన్న కొడుకులే కసాయిలుగా మారి పది రోజులుగా యముకలు కొరికే చలి ఉన్నప్పటికీ స్మశాన వాటికలో వృద్ధురాలు రాజవ్వ కన్న కొడుకులే వదిలేయగా చలినితట్టుకొని ఆ వృద్ధురాలు నరకయాతన అనుభవిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన జగిత్యాల మోతె స్మశానవాటికలో వృద్ధురాలు పది రోజులుగా కన్న కొడుకులే తల్లి రాజవ్వను వదిలేశారు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తల్లిని కొడుకులు చితకబాదారు. పింఛన్ డబ్బు ఇవ్వకపోవడంతో తాగుడుకు బానిసైన ఓ కొడుకు ఇంటి నుండి నెట్టి వేయడంతో ఆ వృద్ధురాలు రాజవ్వ కాలు
విరిగి,అచేతన స్థితిలో ఉంది.
నాకు నలుగురు కొడుకులున్న బుక్కెడు బువ్వ పెట్టే వారు లేరని వృద్ధురాలు రాజవ్వ భోరున విలపిస్తుంది. ఆ నోట, ఈ నోట జిల్లా సంక్షేమశాఖ అధికారులకు సమాచారం చేరగా ఆ అవ్వను చేరదీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం ఆ కన్న తల్లిని స్మశాన వాటికలో వదిలేసిన ఆ నలుగురు కొడుకులపై చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ వెల్లడించారు.