HomeTelanganaUncategorized

అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుంటాం…మంత్రి కొండా సురేఖ

అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుంటాం…మంత్రి కొండా సురేఖ

అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుంటాం దేవుడి మాన్యాలపై సర్వే నిర్వహిస్తాం ఒక పైసా దుర్వినియోగం కానివ్వం అర్హత గల ఆలయాలకు ధూప దీప నిర్వహణ

‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌
తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతిలో పెట్టకండి మంత్రి గంగుల కమలాకర్
దివ్యాంగులకు కేసీఆర్ శుభవార్త… పింఛన్ పెరిగింది

అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుంటాం

దేవుడి మాన్యాలపై సర్వే నిర్వహిస్తాం

ఒక పైసా దుర్వినియోగం కానివ్వం

అర్హత గల ఆలయాలకు ధూప దీప నిర్వహణ నిధులు

సబ్బితం సీతారామాంజనేయ దేవాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

పెద్దపల్లి ప్రతినిధి,పెద్దపల్లి రూరల్, నవంబర్26( నినాదం) రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవాలయ భూములను వెనక్కి తీసుకుంటామని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దేవుడి సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగం కావద్దనేది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందని ఆమె చెప్పారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో సీతారామాంజనేయ దేవాలయంలో రూ.50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవుడు మాన్యాలు వేలాది ఎకరాలు అన్యాక్రాంత మయ్యాయన్నారు.
సర్వే నిర్వహించి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందనేది తేల్చి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. దేవుడి భూములు ఖాళీగా ఉంచడం వల్ల ఇతరులు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. దీన్ని నివారించేందుకు వాటిని సోలార్ ప్లాంట్లకు లీజుకు ఇవ్వడం వల్ల ఆదాయం వస్తుందన్నారు. అలాగే పామాయిల్ సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేవుడి బంగారం, వెండి లాకర్లలో ఉంటే ఏమొస్తుందని వ్యాఖ్యానిస్తూ.. సద్వినియోగం అయ్యేలా చేస్తామన్నారు. ఆదాయం పెంచుకోవడం ద్వారా చిన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సౌకర్యాలు ఎంతో మెరుగుపరిచినట్లు వివరించారు. వేములవాడ ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టీటీడీ నిధులు రావడం నిలిచిపోయాయని ఆరభించారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి
తిరిగి నిధులు వచ్చేలా చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో 320 ఆలయాలకు గానూ 260 ఆలయాలకు ధూప దీపాల కింద నిధులుఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న మిగతా ఆలయాల వివరాలతో ప్రతిపాదనలు పంపాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సబ్బితం సీతారామాంజనేయ ఆలయానికి గొప్ప నేపథ్యం ఉందన్నారు. ఈ ఆలయాన్ని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి అనుసంధానం చేసి నెలకు రూ. 20 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సభ్యత్వం గ్రామస్తులు తనను ఎన్నోసార్లు ఇక్కడికి ఆహ్వానించారని, దేవుడి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
చిన్న ఆలయమైనప్పటికీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.