HomeNationalUncategorized

కొన్ని వర్గాలకే భూమి కేటాయించడం రాజ్యాంగ వ్యతిరేకం

కొన్ని వర్గాలకే భూమి కేటాయించడం రాజ్యాంగ వ్యతిరేకం

కొన్ని వర్గాలకే భూమి కేటాయించడం రాజ్యాంగ వ్యతిరేకం స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల

అట్లుంటది మనతోని..టీవీ రిపోర్టర్లా మజాకా ?
కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు మృతి…కేసీఆర్ సంతాపం

కొన్ని వర్గాలకే భూమి కేటాయించడం రాజ్యాంగ వ్యతిరేకం

  • స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం
  • న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవోల రద్దు

వారు కట్టిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశం |

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు. జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించిన 2005 నాటి జీవో(243, 244) లనే కాక, భూమి కేటాయించేందుకు 2008లో జారీ చేసిన జీవోలు 419, 420, 422 నుంచి 425లను కూడా రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం అంతిమ తీర్పు వెలువరించింది.

న్యూఢిల్లీ : తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, అఖిల

భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు. జర్నలిస్టులను ప్రత్యేక వర్గం గా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించ డాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ వర్గీకరణకు వీలు ໘໖ 2005 ໖ (243, 244) , భూమి కేటాయించేందుకు 2008లో జారీ చేసిన జీవో లు 419, 420, 422 నుంచి 425లను కూడా రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడి న ధర్మాసనం సోమవారం అంతిమ తీర్పు వెలువరిం చింది. రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద సమాన త్వ హక్కును ఈ కేటాయింపులు ఉల్లంఘించాయని

కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు నేపథ్యంలో భూమి కేటాయింపులకోసం ఏర్పడిన సహకార సంఘాలు, వాటి సభ్యులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము సహా డిపాజిట్ చేసిన మొత్తం డబ్బునూ తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తంపై ఏ మేరకు వడ్డీ చెల్లించాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాలని, అయితే ఆ మొత్తం ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు నిర్ణయించే వడ్డీ రేట్లకు మించరాదని తేల్చింది. సహకార సంఘాలు, వాటి సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కుదు ర్చుకున్న లీజు ఒప్పందాలు కూడా రద్దయినట్లేనని ప్రక టించింది. సహకార సంఘాలు, సభ్యులు చెల్లించిన డెవలపమెంట్ చార్జీలు, ఖర్చులను కూడా ఆదాయ పన్ను రిటర్నుల్లో సర్టిఫై చేసిన తర్వాత తిరిగి

చెల్లించాలని తమ తీర్పులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాము వెనక్కు తీసుకున్న భూమిని ఏమి చేయాలో నిర్ణయించు కోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

భూకేటాయింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సహకార సం ఘాలు, వాటి సభ్యులు దాఖలు చేసు కున్న అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ వర్గాలకు చెందిన వారికి భూకేటాయింపులపై కొన్ని విధివిధా నాలను నిర్ణయిస్తూ 2010లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ అంతి మ తీర్పు వెలువరించింది.

సామాన్యుడికి నష్టం..

తమ ఇష్టం వచ్చిన వారికి విలువైన వనరులను అక్రమంగా పంపిణీ చేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. విస్తృత సామాజిక ప్రయోజనాలకు అనుగు ణంగా వనరులను కేటాయిం చాలని, చట్టసభలు, ప్రభు త్వం, న్యాయవ్యవస్థ ప్రజలకు ట్రస్టీలుగా వ్యవహరిం చాలని హితవు పలికింది. సు ప్రీం, హైకోర్టు న్యాయ మూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలి స్టులను ప్రత్యేక కేటగిరీలుగా భావించి భూమిని తక్కువ ధరకు కేటాయించడం అసమానతల్ని శాశ్వతం చేస్తుం దని పేర్కొంది. రాజ్యాం గంలో పేర్కొన్న సమానత్వం, నిష్పాక్షికత ప్రమాణాలకు ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. క్రీడలు, ఇతర కార్యక లాపాల ద్వారా దేశ ప్రగతికి తోడ్పడేవారికి హేతుబ ద్ధంగా, పక్షపాతం లేకుండా భూమి కేటాయించాలను కున్నా అది ఆర్టికల్ 14 పరిధిలోనే జరగాలని ధర్మాసనం పేర్కొంది.