HomeTelanganaPolitics

పత్తిపాక రిజర్వాయర్ తో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం – మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

పత్తిపాక రిజర్వాయర్ తో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం – మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

పత్తిపాక రిజర్వాయర్ తో రైతులకు మేలు నిర్మాణ స్థలాన్ని పరిశీలించినమంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ప్రతినిధి, ధర్మా

ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.
భాష రాని మంత్రులు “చరిత్ర”నే మార్చేశారు
హైదరాబాద్ ఆభివృద్ది కోసం 10వేల కోట్లు -మంత్రి శ్రీధర్ బాబు

పత్తిపాక రిజర్వాయర్ తో రైతులకు మేలు

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన
మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి ప్రతినిధి, ధర్మారం, నవంబర్ 24( వినాదం)

పెద్దపల్లి జిల్లాలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు. ధర్మారం మండలం లో నిర్మించనున్న పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని మంత్రి డి.శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన స్థలం, భూ సేకరణ ప్రతిపాదనలు, ఇతర అంశాలతో కూడిన డిపిఆర్ రూపొందిస్తున్నామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ తో 2.40 లక్షల ఎకరాల స్థిరీకరణతో పాటు కొత్తగా10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు
చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్య తీరుతుందన్నారు.
ఈ రిజర్వాయర్ తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, వరద కాలువ, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లను కాంగ్రెస్ హయాంలోని నిర్మించామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు.
వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న రకాలకు
రూ. 500 ల బోనస్ ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల ధాన్యంలో నాలుగు నుంచి ఐదు కేజీలు తరుగు పేరుతో దోపిడీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టిందన్నారు. ఖరీఫ్ సీజన్ నుంచి సన్న రకం వడ్లకు బోనస్ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఖజానాను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు.
గత ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా నుంచి గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించిందే గానీ ఇక్కడి ఆయకట్టు పెంచడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు.
ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు, ఆర్డీవో బి.గంగయ్య, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.