HomeTelangana

ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం… మంత్రి సీతక్క

ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం… మంత్రి సీతక్క

ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం….. దేశ భవిష్యత్తు బాధ్యత అంగన్వాడీ టీచర్లదే ముందు జాగ్రత్తలతో కాన్సర్‌ నివారణ సాధ్యం రాష్ట్ర

కాంగ్రెస్ లో మళ్ళీ రచ్చ… నాగం Vs జూపల్లి
గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు తపించిన గ్రామ సర్పంచ్
తెలంగాణ గవర్నర్ తమిళిసై MPగా పోటీ చేయనున్నారా ?

ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం…..

  • దేశ భవిష్యత్తు బాధ్యత అంగన్వాడీ టీచర్లదే
  • ముందు జాగ్రత్తలతో కాన్సర్‌ నివారణ సాధ్యం
  • రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/ ములుగు ప్రతినిధి, (నినాదం):

రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరు నాగారం గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల ఆరోగ్య సంరక్షణ ముఖ్యమనే ఉద్దేశంతో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గ్రేస్‌ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ముందస్తు క్యాన్సర్ నిర్దారణ పరీక్షల శిబిరాన్ని రాష్ట్రంలో ముందుగా మన జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్యాన్సర్ ఏ రూపంలో వస్తుందో తెలియదని, కానీ ముందస్తు పరీక్షలు చేసుకొని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడవచ్చని అన్నారు. నేటి పరిస్థితుల్లో మనం తినే తిండి, త్రాగే నీరు ప్రతీ పదార్థంలో కల్తీ ఉండటంతో ప్రమాదకరమైన క్యాన్సర్ల బారిన పడుతున్నామని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్నిమాత్రమే తీసుకోవాలని సూచించారు. ఎంత ఉత్సాహంగా పని చేయాలన్నా సరైన ఆరోగ్యం లేనిదే సాధ్యంకాదని, ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆరోగ్యంగా ఉంటేనే ఎదిగే పిల్లలు సైతం చక్కగా ఏ పోషకాహార లోపం లేకుండా ఎదుగుతారని, అలాగే ఆట, పాటలు, క్రమ శిక్షణతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకుంటారని తద్వారా దేశం కూడా ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందని, దేశ భవిష్యత్తు బాధ్యత అంగన్‌వాడీ టీచర్లపైనే ఉందని అన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని దశల వారీగా మహిళా సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లకు గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు.

  • ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రాణాలకే ప్రమాదం…
  • తెల్లం వెంకట్రావ్‌, భద్రాచలం శాసన సభ్యులు

నిత్యం బిజీబిజీగా ఉండే మనం ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్టంలోనే మొదటిసారి ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఆరోగ్యం కోసం క్యాన్సర్‌ నిర్థారణ ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం సంతోషకరం అని అన్నారు. ఒక డాక్టర్ గా తనకు సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, మహిళలు కుటుంబ బాధ్యతలు, ఇతరపనుల్లో హడావిడిగా ఉంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లు కాస్త నిర్లక్ష్యం చేయడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అలాంటి సందర్భంలో గర్భసంచి తొలగించాల్సి వస్తుందని, రొమ్ములో కణుతులు, ఇతర ఏమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తే అవి రొమ్ము క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతీ మహిళ తప్పకుండా ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రత్యేకంగా గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న మంత్రికి ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే. శిరీష, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ వలియా భీ, సీడీపీఓలు ప్రేమలత, మల్లీశ్వరి, గ్రేస్‌ సంస్థ ప్రతినిధులు, డాక్టర్లు, మెడికల్ టెక్నీషియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.