HomeTelanganaPolitics

కేసీఆర్ దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు 26న బీఆరెస్ పెద్దపల్లి జిల్లా ముఖ్యుల సమావేశం

కేసీఆర్ దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు 26న బీఆరెస్ పెద్దపల్లి జిల్లా ముఖ్యుల సమావేశం

రేపు బిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కార్యాలయం లో బిఆర్ఎస్ జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరుగుతుందని టిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోర

కేసీఆరె కే మా ఓటు: 10 గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం
కాంగ్రెస్ కు షాక్: బీఆరెస్ లో చేరిన కీలక నేత
బీఆర్ఎస్‌ను భయపెడుతున్న అనర్హత పిటిషన్లు.. ఈ నెలాఖరుకు తేలనున్న భవితవ్యం!

రేపు బిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కార్యాలయం లో బిఆర్ఎస్ జిల్లా ముఖ్యనాయకుల సమావేశం జరుగుతుందని టిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సమావేశం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా బిఆర్ఎస్ ఇంచార్జి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరవుతున్నారని,వారితో పాటు పెద్దపల్లి నియోజవర్గం ఇంచార్జి దాసరి మనోహర్ రెడ్డి ,మంథని నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకర్ హాజరవుతున్నారన్నారు. కావున బిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా లోని గ్రామాల మరియు డివిజన్ల ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఈ సమావేశంలో పాల్గొనాలని చందర్ కోరారు.
నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని, 29 న జరిగే దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని చందర్ పిలుపునిచ్చారు.
ఆరోజు స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినమని,
ఆనాడు కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ తెచ్చుడో అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారోజని,
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి…కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ అని ఆయన కొనియాడారు.
అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని,
మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని,అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయని ఆయన ప్రకటనలో తెలిపారు.
ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుని మీద ఉన్నదని,
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు.
ఒక్క వర్గం కాదు…సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారన్నారు.
అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది…కాంగ్రెస్ కబంధ హస్తల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచూ చెప్పేవాడని,
ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారన్నారు. దాని కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భం అని ఆయన గుర్తు చేశారు.
నవంబర్ 29 న బిఆర్ఎస్ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామన్నారు.
తెలంగాణ పై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ…రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు కదం తొక్కుతామని చందర్ తెలిపారు.
29 నవంబర్ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదిలి రావాలని పార్టీ నేతలకు పిలుపు ఇవ్వడం కోసం ఈసమావేశం ఏర్పాటు చేశామన్నారు.
కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని,
దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీ లకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న‌ సందర్భంలో సకాలంలో అందరు హాజరై సమావేశం ని విజయవంతం చేయాలని కోరు కంటి చందర్ తన ప్రకటనలో పిలుపునిచ్చారు