HomeTelanganaCrime

‘లత హత్యకు కారణమైన‌ భర్త అత్తమామలను అరెస్టు చేసి శిక్షించాలి’

‘లత హత్యకు కారణమైన‌ భర్త అత్తమామలను అరెస్టు చేసి శిక్షించాలి’

నిర్మల్ జిల్లా రేవోజిపేట గ్రామం దస్తూర్బాత్ మండలం కి చెందిన 23 సంవత్సరాల లతను ఆమె భర్త అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించారని, వారిని వెంటనే అరె

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
మావోయిస్టుల‌ దాడి, 35మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మావోయిస్టుల‌ మృతి ‍- మావోయిస్టు పార్టీ ప్రకటన‌

నిర్మల్ జిల్లా రేవోజిపేట గ్రామం దస్తూర్బాత్ మండలం కి చెందిన 23 సంవత్సరాల లతను ఆమె భర్త అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని పౌరహక్కుల స౦ఘం, చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేశాయి.
లత తండ్రి పోగుల రాజేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో పౌర హక్కుల సంఘం కోశాధికారిగా పనిచేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అతన్ని UAPA కేసు పై అక్రమంగా అరెస్ట్ చేసి పది నెలల నుండి జైలులో నిర్బంధించారని ఆ సంఘాలు తెలిపాయి. పోగుల రాజేశం కూతురు లతను ఆమె భర్త అత్తమామలు వేధింపులు గురి చేయడం అత్యంత బాధాకరమని, కూతురి కడసారి చూపులకు పోగుల రాజేశం కు వెంటనే ఎమర్జెన్సీ ఫెరోల్ బెయిల్ ఇవ్వాలని, ఆయన పెరోల్ పై విడుదలయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశాయి. లత హత్యకు కారణం అయిన వారిని అరెస్టు చేసి సమగ్ర విచారణ జరిపి చట్టమైన చర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం, పౌరహక్కుల సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేశాయి.