HomeTelanganaPolitics

తెలుగు వాళ్ళు ఈ నటిని బహిష్కరించాలి

తెలుగు వాళ్ళు ఈ నటిని బహిష్కరించాలి

ఒకప్పుడు తెలుగు, తమిళ బాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కస్తూరి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకు

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం
వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే
సంక్రాంతి: హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది

ఒకప్పుడు తెలుగు, తమిళ బాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కస్తూరి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలైన ఆమె తెలుగువాళ్ళను కి౦చపరుస్తూ నోరుపారేసుకుంది. తమిళనాడులో ఓ బ్రాహ్మణ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజుల కాలంలో అంత:పుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు వచ్చిన వారే తెలుగువారని, అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారని, అలా తమిళనాడులో కూడా తెలుగువారే రాజ్యం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఆమె మాట్లాడారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె స్వంత పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది. దీంతో కస్తూరి మాట మార్చింది. తాను తెలుగువాళ్ళను ఏమీ అనలేదని అంతా డీఎంకే పార్టీ కుట్ర అంటూ తన మాటలను సమర్దించుకునే ప్రయత్నం చేశారు. కస్తూరి మాట్లాడిన మాటల వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారి సాక్షం ఇస్తుండగా ఆమె మాత్రం తానలా మాట్లాడలేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా కొందరు మూర్ఖులు తనపై తెలుగు ప్రజలకు ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఏడుపు మొదలుపెట్టారు. ఇలా తెలుగు జాతిపై ఇంత ద్వేషం పెంచుకొని, ఇంత దుర్మార్గంగా మాట్లాడేవారిని తెలుగువాళ్ళు బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.