కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్న
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్నికల హామీలు ఉండాలి, లేకపోతే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది అని ఆయన అన్న మాటలు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు ఆయుధంగా మారగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు మండిపోతోంది. కాంగ్రెస్ పార్టీని మించి అలవిగాని హామీలిచ్చిన బీఆరెస్ పార్టీ ఇప్పుడు ఖర్గే మాటలు పట్టుకొని రేవంత్ ను విమర్శిస్తోంది. గాలి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ నయవంచన చేసిందని, అందువల్ల క్షమాపణ చెప్పాలని కేటీయార్ విమర్శించాడు. ఇక ఇటు రేవంత్ కు, అటు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఖర్గే మాటలు మంటపుట్టిస్తున్నాయి. ఖజానా ఖాళీగా ఉందని తెలిసీ తెలంగాణలో గెలుపు కోసం తాము ఇచ్చిన హామీలు అమలుపర్చలేక రేవంత్ ఇప్పుడు సతమతమవుతున్నాడు. దీంతో ఒకవైపు ప్రజలనుండి వ్యతిరేకత, మరోవైపు బీఆరెస్ విమర్శల దాడి జరుగుతున్న నేపథ్యంలో తమ అధ్యక్షుడి మాటలు రేవంత్ కు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. నిజానికి ఖర్గే మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం. అయితే కర్నాటక, తెలంగాణ ఎన్నికలకు ముందు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదనేదే ప్రశ్న.