HomeTelanganaPolitics

హైదరాబాద్ ఆభివృద్ది కోసం 10వేల కోట్లు -మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ఆభివృద్ది కోసం 10వేల కోట్లు -మంత్రి శ్రీధర్ బాబు

తమ‌ది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, తాము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టిన వజ్రోత్సవాలు
గద్దర్ పై కాల్పులు జరిపించింది నేను కాదు -చంద్రబాబు

తమ‌ది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, తాము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్,విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ అజయ్ యాదవ్,కాంగ్రెస్ ఇన్చార్జి వజ్రెష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం నిధుల కేటాయింపు లో నిర్లక్ష్యం వహించింది అన్నారు. బోడుప్పల్ లో ప్రధానంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సమస్య, ఎస్సీ భూముల సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఈ విషయాల పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని పరిష్కరించే దిశగా చూస్తామని తెలిపారు.

మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు.