HomeTelanganaCrime

వేణుస్వామి అరెస్టు తప్పదా ?

వేణుస్వామి అరెస్టు తప్పదా ?

నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో త్వరలోనే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిల్

ఎస్ఎల్బీసీ దుర్ఘటన దురదృష్టకరం. ఇది అనుకోని సంఘటన.నల్గొండకు నీటి సమస్య తీర్చేందుకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నాం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ కు శాశ్వత పరిష్కారం వచ్చేది కాదు:రేవంత్ రెడ్డి
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా… కేసీఆర్ ఆదేశాలు

నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో త్వరలోనే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తమ ముందు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ వేణుస్వామిని ఆదేశించిన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ ఆదేశాలపై వేణు స్వామి అప్పుడు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మహిళా కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ రోజు హైకోర్టు తానిచ్చిన స్టేని ఎత్తివేసింది. వేణు స్వామిపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం మహిళా కమిషన్ కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం మహిళా కమిషన్ ను ఆదేశించింది. దాంతో ఇప్పుడు మహిళా కమిషన్ ముందు వేణు స్వామి హాజరు హాజరు కాక తప్పదు. విచారణ తర్వాత వేణుస్వామి అరెస్టు తప్పకపోవచ్చు.
.