HomeTelanganaPolitics

‘హైడ్రా’ కూల్చివేతల భయంతో దెబ్బ తిన్న‌ రియల్ మార్కెట్

‘హైడ్రా’ కూల్చివేతల భయంతో దెబ్బ తిన్న‌ రియల్ మార్కెట్

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. మొత్తంగా ఓ లక్ష ఇళ్లు హైదరాబాద్‌లో అమ్మకానికి రెడీగా ఉన్నాయని మార్కెట్ వర్గా

‘హైడ్రా’ తో రేవంత్ పై తీవ్ర వ్యతిరేకత‌
FTL పరిధిలో ఉన్న తన‌ ఆస్తులు కాపాడుకోవడానికే హరీశ్ రావు ఆరాట‌మా ?
స్పీడ్ తగ్గించు… రేవంత్ కు హైకమాండ్ ఆదేశం!

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. మొత్తంగా ఓ లక్ష ఇళ్లు హైదరాబాద్‌లో అమ్మకానికి రెడీగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హైడ్రా భయంతో కొనుగోలుదారులు ఇళ్ళు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. ఎంక్వయిరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యధిక మంది వేచి చూద్దామన్న ఆలోచనలో ఉండటంతో డిమాండ్ మందకొడిగా ఉంది.
ముఖ్యంగా హైడ్రా చెరువులు, ప్రభుత్వ భూములపై అధికారికంగా పూర్తి స్పష్టత ఇస్తే.. మళ్లీ కొనుగోళ్లు ఊపందుకోవచ్చు. హైడ్రా ధాటికి ఇళ్ల బ‌య్య‌ర్లు.. తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి మొదలు భారీ విస్తీర్ణంతో ట్రిపుల్, ఫోర్, ఫైవ్ బెడ్రూం అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. కనీసంగా పదిహేనువందల‌ చదరపు అడుగుల నుంచి మొదలు పదిహేనువేల చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో అపార్ట్ మెంట్స్, విల్లాలు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్నాయని రియల్టర్లు ప్రకటనలు ఇస్తున్నారు.భారీ నివాస ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిన్న బిల్డర్లు నిర్మించిన స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు అన్నీ కలిసి దాదాపు లక్ష ఇళ్ల వరకు నిర్మాణం పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ కు రెడీగా ఉన్నాయి. అయితే ‘హైడ్రా’ గందరగోళం ఉన్నంత వరకు ఇంటి కొనుగోలు అంత మంచిది కాదని వేచిచూసే ధరణి అవలంబిస్తున్నారు గృహ కొనుగోలుదారులు.