HomeTelanganaPolitics

టాలీవుడ్ పెద్దల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం !

టాలీవుడ్ పెద్దల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం !

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాల పట్ల‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సురే

‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’
ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు ?
మీ జుగుస్సాకరమైన రాజకీయాల్లోకి సమంత, రకుల్ లను లాగడం సమంజసమా ?

మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాల పట్ల‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సురేఖ తన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత‌ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక వివాదం ముగించాలని కోరినప్పటికీ పలువురు టాలీవుడ్ ప్రముఖులు రెచ్చిపోతుండటం పట్ల రేవంత్ కోపంగా ఉన్నారట.

బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేంచేసినా మౌనంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పట్ల మొదటి నుంచీ టాలీవుడ్ ఇలాగే వ్యవహరిస్తోందని, ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డు విషయంలోనూ టాలీవుడ్ కావాలనే నిరాసక్తత ప్రదర్శిస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇకపై టాలీవుడ్ పట్ల కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని టాక్. టిక్కట్ల ధరల పెంపు, సబ్సిడీలు వంటి టాలీవుడ్ పెద్దలు కోరే గొంతెమ్మ కోర్కెలను పట్టించుకోవద్దని రేవంత్ నిర్ణయించుకున్నారట.