HomeTelanganaEditor's Choice

దసరాకు ఊరెళితే సమాచారం ఇవ్వండి

దసరాకు ఊరెళితే సమాచారం ఇవ్వండి

ఆభరణాలు, డబ్బుల విషయంలో జాగ్రత్తలు అవసరం : రామగుండం సి.పి శ్రీనివాస్ సూచన పెద్దపల్లి ప్రతినిధి, అక్టోబర్ 02 (నినాదం): దసరా పండుగకు ఊరెళ్లే వారు తగ

కాసేపట్లో మీడియా ఎదుటకు దీప్తి సోదరి చందన
‘గ్రూప్స్’ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మ‌హత్య..అర్దరాత్రి హైదరాబాద్ లో విద్యార్థుల ఆందోళన‌
ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు

ఆభరణాలు, డబ్బుల విషయంలో జాగ్రత్తలు అవసరం : రామగుండం సి.పి శ్రీనివాస్ సూచన

పెద్దపల్లి ప్రతినిధి, అక్టోబర్ 02 (నినాదం): దసరా పండుగకు ఊరెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. బీరువా తాళాలను వెంట తీసుకెళ్లాలని తెలిపారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను లను ఏర్పాటు చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇస్తే నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్లు ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా వీల్స్ లాక్ తో, చైన్స్ తో పోల్స్, చెట్లకు లాక్ వెయ్యడం మంచిదని సూచించారు. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్ సెక్యూరిటీ గార్డ్ గా పనిలో నియమించుకోవాలని పేర్కొన్నారు. ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చుకుని ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటి పరిసరాలను లైవ్లో చూసుకొవచ్చని తెలిపారు. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
చట్ట వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవు….
సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్, ఇతర సోషల్‌ మీడియాలను వేదికగా కొందరు మతాలు, ప్రముఖుల ను టార్గెట్‌గా పోస్టులు పెడుతున్నారని తెలిపారు . కొంతమంది వాట్సప్ గ్రూపులలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నారు. ఓ వర్గాన్ని, వ్యక్తులను కించపరుస్తూ పోస్ట్‌ చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పుకార్లు ప్రచారం చేసినా కేసులు తప్పవని హెచ్చరించారు. కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. సోషల్‌ మీడియా పోస్ట్ లపై మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందని, కొందరు ఐపీ అడ్రస్ లు మార్చి ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.