హైదరాబాద్, నినాదం న్యూస్ : స్వచ్ఛత హై సేవా 2024 ప్రచారంలో భాగంగా, ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఈ బుధవారం రోజు గాంధీ జయంతి / స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా
హైదరాబాద్, నినాదం న్యూస్ : స్వచ్ఛత హై సేవా 2024 ప్రచారంలో భాగంగా, ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఈ బుధవారం రోజు గాంధీ జయంతి / స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా తన స్థానిక ప్రధాన కార్యాలయంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ నేతృత్వం వహించగా, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎల్.హెచ్.ఓ ప్రాంగణం, సుల్తాన్ బజార్ మరియు గుజరాతీ గల్లీలలో పరిశుభ్రతా డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో అధికారులు మరియు సిబ్బంది చురుకుగా పాల్గొని, ప్రజలు నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీజీఎం రాజేష్ కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛత హై సేవా 2024 అనేది భారతదేశంలో దేశవ్యాప్తంగా జరిగుతున్న పరిశుభ్రతా ప్రచారం అని, ఇది సెప్టెంబర్ 17 న ప్రారంభం అయి, అక్టోబర్ 2, 2024 తో ముగిసిందని అని అన్నారు. ఈ చొరవ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క 10వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందనన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ ఎస్.హెచ్.ఎస్ చొరవలను చేపట్టిందని, మురికి మరియు కష్టతరమైన చెత్త ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) క్లియర్ చేయడానికి మెగా పరిశుభ్రతా డ్రైవ్‌లుగా 57 క్లీన్‌నెస్ టార్గెట్ యూనిట్లను (సీటీయు) లను గుర్తించామని రాజేష్ కుమార్ అన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా “ఏక్ పేడ్ మా కే నామ్” ప్రచారంలో భాగంగా సర్కిల్స్ లో 15000 మొక్కలను నాటామని తెలిపారు. సఫాయిమిత్రుల సేవలను అభినందించి, వారికి పీపీఈ కిట్‌లు మరియు రక్షణ గేర్‌లను అందించామన్నారు. సఫాయిమిత్రులలో సామాజిక భద్రతా పథకాలపై అవగాహన పెంచడానికి ఒక అక్షరాస్యత శిబిరాన్ని నిర్వహించామన్నారు. జనరల్ మేనేజర్ నెట్‌వర్క్-2 ప్రకాష్ చంద్ర బరోర్, జనరల్ మేనేజర్ నెట్‌వర్క్ 1 – రవి కుమార్ వర్మ మాట్లాడుతూ స్వచ్ఛత హై సేవా చొరవలు ప్రజారోగ్యం మరియు పర్యావరణ స్థిరత్వంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని అన్నారు.
ఎస్బీఐ తెలంగాణ లీడ్ బ్యాంక్‌గా 220 ఈవెంట్లను నిర్వహించిందని తెలిపారు. అధికారులు, సిబ్బంది, శుభ్రపరిచే కార్మికులు మరియు భద్రతా గార్డులందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.