తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ జరిగి=ందని మీడియా
తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ జరిగి=ందని మీడియాకు ఎందుకు చెప్పారని కోర్టు ప్రశ్నించింది. టీటీడీ ఈ వో స్వయంగా కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపేశామని చెప్పిన తర్వాత కూడా అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని కోర్టు మండిపడింది. చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం జరిపిన విచారణలోప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు. జులైలో రిపోర్ట్ వస్తే, సెప్టెంబర్లో చెప్పారెందుకు? అని అడిగారు. అలాగే, కల్తీ నెయ్యి లడ్డూలో వాడినట్లు ఆధారాలు లేవుకదా ! శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు? అని ధర్మాసనం ప్రశ్నించింది.లడ్డూను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు ? సెప్టంబర్ 18వ తేదీనాటి చంద్రబాబు ప్రకటనకు ఆధారాలున్నాయా ? అని ప్రశ్నించిన ధర్మాసనం కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరం పెట్టండి అని సూచించింది.
లడ్డూ అంశంపై విచారణకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) వేశారు. ఇది దర్యాప్తునకు సరిపోతుందా? అని సుప్రీం కోర్టు సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను ప్రశ్నించింది. ఈ విచారణ అనంతరం, తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.