HomeTelanganaUncategorized

విత్తనాలు అందక రోడ్లెక్కిన రైతన్నలు: ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

విత్తనాలు అందక రోడ్లెక్కిన రైతన్నలు: ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్న రైతులు ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి క

హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ
మాజీ నక్సలైటు సీతక్కపై పోటీకి మరణించిన నక్సలైటు కూతురును దింపిన కేసీఆర్
‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’

విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం

రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్న రైతులు

ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

జనుము జీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని, విత్తనాల డిమాండ్ ఎంత ఉందో అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు . అబద్దాపు హామీలతో రైతులను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలయ్యాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని, చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ అని ఆయన అన్నారు. రైతుబంధుకు ఎగనామం పెట్టి, రుణమాఫీని మర్చిపోయి, బోనస్ 500 రూపాయలను ఆటకెక్కించిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విత్తనాల విషయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో రైతులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని ,ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని కెసిఆర్ నాయకత్వం లోని టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గనుక పనిచేయడానికి కొంత గడువు ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఈ పరిస్థితులు చూస్తే ఈ ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసే పరిస్థితి వచ్చేటట్టుందన్నారు. రైతుల పక్షాన మేము పోరాడడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వమే కల్పిస్తున్నదని, అందుకే ప్రభుత్వం తో పోరాడి రైతులకు సరిపడా విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని చంటి క్రాంతి కిరణ్ తెలిపారు .