HomeUncategorized

తుపాకీ నీడలో ‘మన్యం’

తుపాకీ నీడలో 'మన్యం' మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఖాకీల డేగకన్ను భద్రాద్రి కొత్తగూడెం

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. మంత్రి గంగుల కమలాకర్
కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదు.
పేటీఎం ఆ సేవలు రద్దు .రిజర్వ్ బ్యాంక్ తీవ్ర చర్యలు.

తుపాకీ నీడలో ‘మన్యం’

  • మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఖాకీల డేగకన్ను

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిథి, మే 12 (నినాదం న్యూస్) : లోక్‌సభ ఎన్నికలకు వేళయింది. 13వ తేదీన (నేడు) ఓటుహక్కు ఉపయోగించుకొని ప్రజలు తమ తీర్పు ఇవ్వబోతున్నారు. పోలింగ్‌కి సంబంధించి అధికార యంత్రాంగ అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అలజడి, అవాంఛనీయ సంఘటనలకు చోటులేకుండా భద్రతా బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగకన్ను వేచి ఉన్నారు.
మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు
భద్రతా బలగాల రక్షణలో ఉన్నాయి. మావోయిస్టు కొరియర్ వ్యవస్థపై పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడం కోసం భద్రతా బలగాలు ఇప్పటికే గ్రామాలలో కవాతు నిర్వహించారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. రహదారులపై ప్రధాన కూడళ్ళలో పోలీసులు కాపుగాచి రేయింబవళ్ళు ఆ మార్గాన వచ్చిపోయే వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

2500 మంది పోలీసులతో బందోబస్తు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పి రోహిత్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 971 పోలింగ్ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్‌లో ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఖచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలోగానీ, పరిసర ప్రాంతాల్లోగానీ ఓటర్లను ప్రలోభపెట్టె వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం ఇతరత్రా వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్‌‌చేసి గానీ, సీ-విజిల్ యాప్ ద్వారాగానీ ఫిర్యాదు చేసి సమాచారం చెప్పాలని కోరారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎస్‌పి విజ్ఞప్తి చేశారు.