HomeTelanganaUncategorized

•మాది దోపిడీ దొరల ప్రభుత్వం కాదు… ప్రజా ప్రభుత్వం

•మాది దోపిడీ దొరల ప్రభుత్వం కాదు…  ప్రజా ప్రభుత్వం

26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం… •శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,నీటిపారుదల శ

స్పీడ్ తగ్గించు… రేవంత్ కు హైకమాండ్ ఆదేశం!
బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.

26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం…

•శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..

•కోదాడ ప్రజల చిరకాల కల నెరవేరింది అన్న మంత్రులు…

•ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

•మా ప్రభుత్వం దోపిడీ దొరల ప్రభుత్వం కాదు… మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం…

కోదాడ, ఫిబ్రవరి 7
(నినాదం న్యూస్):
కోదాడ నియోజకవర్గం ప్రజల చిరకాల కల నెరవేరిందని, గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు ఇకపై మెరుగైన వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన కోదాడ పట్టణంలోనే ప్రజలకు అన్ని వసతులతో సౌకర్యమంతమైన 26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగబోతుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి
100 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రతిపాదనను అటకెక్కించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట 60 రోజుల్లోనే ఆస్పత్రి నిర్మాణం జరపడం అంటే మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏమిటో నిజాయితీ ఏమిటో అర్థమవుతుందని ప్రజలందరూ ఇది గమనించాలన్నారు. అదేవిధంగా కోదాడ మండలం రెడ్లకుంట్ల గ్రామంలో 5 వేల మంది ఆయకట్టు రైతులకు ఉపయోగపడేందుకు 47 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నామని, అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో కూడా చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని గత మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకానికి పునర్నిర్మానం చేసేందుకు 5 కోట్ల మేర నిధులు మంజూరు చేసామన్నారు. కోదాడ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా అనేక కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తామని ఇంకా మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజకీయంగా నన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన కోదాడ ప్రాంతాన్ని ఎప్పటికీ మరువనని నా శక్తి మేర నిధులు కేటాయిస్తానని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… కోదాడ ప్రాంతంతో నాకు ఎనలేని అనుబంధం ఉందని, నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కూడా కోదాడ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించానని ఈ ప్రాంత ప్రజలు ఏనలేని ప్రేమను నాపై ఎల్లప్పుడూ చూపిస్తారని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ…. ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రతిరోజు ఫోన్ చేస్తూ కోదాడ ప్రాంతాల్లో మీరు పర్యటించాలని అక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరపాలని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని ఆయన అన్నారు. కోదాడ ప్రాంత ప్రజల పై ఉన్న అభిమానం, వారికి నిరంతరం సేవ చేయాలని, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలని, వైద్యం అందక ఎవరి ప్రాణం పోకూడదని అనే ఉద్దేశంతోనే ఉత్తంకుమార్ రెడ్డి నాపై ఒత్తిడి తెచ్చారని ఇక్కడే ఆయన పనితీరు కనిపిస్తుందని కొనియాడారు. ఇది దొరల ,దోపిడీ ప్రభుత్వం కాదు మాది ప్రజా ప్రభుత్వమని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అతి ముఖ్యమైన ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని 10 లక్షల వరకు పెంచమన్నారు. ఆరోగ్యశ్రీలో 1600 వ్యాధులకు సంబంధించి 1800 మేరకు పెంచామన్నారు. మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం వైద్య అధికారులతో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ వెంకట్రావు,అడిషనల్ కలెక్టర్ ప్రియాంక, హెల్త్ డైరెక్టర్ కర్ణన్,జెసి వెంకట్ రెడ్డి ఆర్డీవో సూర్యనారాయణ,డీఎంహెచ్ఓ కోటాచలం,మెడికల్ ఆఫీసర్స్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు,డిపిఓ యాదయ్య,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ,ఎమ్మార్వోలు,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,ఎంపీపీలు,జడ్పిటిసిలు కౌన్సిలర్లు మండల నాయకులు పట్టణ నాయకులు,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.