HomeTelanganaUncategorized

మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే బిరుదు కన్నుమూత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సోమవారం కన్నుమూశారు. మెదడు, గొంతు స

మైనార్టీలకు షాకిచ్చిన ప్రభుత్వం.. ఆర్థిక సాయం విషయంలో కీలక నిర్ణయం
కార్యకర్త పాడే మోసిన డీసీసీ అధ్యక్షుడు
నాన్న ఆశయాలు కొనసాగిద్దాం -అమరుడు సాయిబాబా కూతురు మంజీరా

మాజీ ఎమ్మెల్యే బిరుదు కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సోమవారం కన్నుమూశారు. మెదడు, గొంతు సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు. రాజమల్లు పెద్దపల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఆయన స్వస్థలం సుల్తానాబాద్ కు తీసుకురానున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో 1930లో జన్మించారు. ఆయన రాజకీయ జీవితం టీడీపీలో మొదలయ్యింది. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. మొట్టమొదట సుల్తానాబాద్ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

మళ్లీ 1994లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డిపై 39677 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2018లో టీడీపీని వీడి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)లో చేరారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు.