HomePoliticsNational

రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి

రాహుల్ పై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం, జైరాం రమేష్, అస్సాం యూనిట్ పీసీసీ చీఫ్ పై దాడి

భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీజేపీ మద్దతుదారులు తమ నాయకులపై దాడి చేశారని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. అస్సాం లో "జై శ్రీరామ్" , "మోడీ, మోడీ" నినాదాలు

కాంగ్రెస్ మార్క్ గూండాయిజం: కాంగ్రెస్ గ్రూపుల మధ్య కొట్లాట – జర్నలిస్టులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు
మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
అధికార పార్టీ అండ: యూనివర్సిటీ VC, అధికారులు, పోలీసులను చితకబాదిన ABVP గ్యాంగ్

భారత్ జోడో న్యాయ్ యాత్రలో బీజేపీ మద్దతుదారులు తమ నాయకులపై దాడి చేశారని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. అస్సాం లో “జై శ్రీరామ్” , “మోడీ, మోడీ” నినాదాలు చేస్తూ కర్రలు, కాషాయ‌ జెండాలు పట్టుకున్న‌ పలువురు బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ వాహనాన్ని అడ్డుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ఏ మాత్రం జంక కుండా బస్సు దిగి వారిదగ్గరికి వెళ్ళాడు. అనంతరం మళ్ళి బస్సులోకి వచ్చి బస్సులోంచి బీజేపీ కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారు.

“మా ‘మొహబ్బత్ కి దుకాన్’ (ప్రేమ దుకాణం) అందరి కోసం తెరిచి ఉంది. ‘జుడేగా భారత్, జీతేగా హిందుస్థాన్’,” అని గాంధీ X లో ఒక పోస్ట్ చేసి ఆ సంఘటన వీడియోను షేర్ చేశారు.
ఆ తర్వాత ఒక బహిరంగ సభలో గాంధీ కూడా మాట్లాడుతూ, “సుమారు 20-25 మంది బిజెపి కార్యకర్తలు కర్రలు పట్టుకుని మా బస్సు ముందు వచ్చారు, నేను బస్సు నుండి బయటకు వచ్చేసరికి వారు పారిపోయారు” అని అన్నారు.

కాగా, ముఖ్యమంత్రి హిమంత బిస్వా ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు గాంధీ, జైరాం రమేష్ , అస్సాం యూనిట్ చీఫ్ భూపేన్ కుమార్ బోరాతో సహా తమ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ నుండి అస్సాంలోకి తిరిగి ప్రవేశించిన యాత్ర కు ప్రతి గంటకోసారి అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది..

సోనిత్‌పూర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వాహనంపై దాడి జరిగిందని, పార్టీ యాత్రతో వస్తున్న‌ విలేకరులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ మహిమా సింగ్ పేర్కొన్నారు.

కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న‌ తర్వాత యాత్రలో చేరడానికి అసోం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కారులో వెళ్తుండగా ఒక గుంపు ఆయన కారును ఆపి అతని ముక్కుపై కొట్టడంతో రక్తస్రావం జరిగింది. మరో పార్టీ కార్యకర్త తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధికార ప్రతినిధి బేదబ్రత బోరా ఆరోపించారు.